Konaseema: కోనసీమ అందాలు ఇక కనుమరుగేనా..? ప్రధాన కారణం ఇదేనా..?

కోనసీమలో ఓ గ్రామం (ఫైల్)

ఆదో భూతల స్వర్గం. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్. అక్కడికెళ్తే చాలు జీవతంలో ఉండే టెన్షన్లన్నీ పటాపంచలవుతాయి. కానీ ఇప్పుడా పచ్చదనం ప్రమాదంలో పడింది.

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  ఆ ప్రాంతమంతా భూతల స్వర్గం. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్. అక్కడికెళ్తే చాలు జీవతంలో ఉండే టెన్షన్లన్నీ పటాపంచలవుతాయి. అప్యాయంగా పలకరించే మనుషులు, ఆహ్లాదపరిచే వాతావరణం ఆ ప్రాంతం సొంతం. అదే కోనసీమ. కొనసీమ అంటేనే పచ్చని రంగు పులుముకున్న ప్రకృతి గుర్తొస్తుంది. ఎత్తైన కొబ్బరి తోటలు.., సముద్ర తీరం.. గోదావరి నదీపరివాహక ప్రాంతం.. పొలాలు మైండ్ లో పిక్చరైజ్ అవుతాయి. అలాంటి కొనసీమకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. అందమైన సీమ ఆపదలో ఉంది. కొబ్బరి చెట్లు ఉప్పుటేర్ల కారణంగా.. నేల చూపులు చూస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఏర్పడుతున్న ఆక్వా చెరువులు, ఆక్వా పరిశ్రమలు కూడా మరో పెద్ద కారణంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల కోనసీమ పెట్టింది పేరైన కొబ్బరి చెట్లు నేల వైపు చూస్తున్నాయి. ఆకాశంలోకి ఠీవీగా చూడాల్సిన ఈ కల్పతరువులు.. దీనంగా భూమి పై వైపు తిరుగుతున్నాయి.

  సముద్రతీరంలోనే..?
  సముద్రతీర ప్రాంతాలతోపాటు ఆక్వా సేద్యం విస్తారంగా ఉంటున్న భూముల్లో కొబ్బరి పంటకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆక్వా సేద్యం వల్ల చెరువుల గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లు తలలు వాల్చేస్తున్నాయి. తీర ప్రాంత భూముల్లోకి ఉప్పునీరు చొచ్చుకురావడం వల్ల చెట్లు చచ్చుపడిపోతున్నాయి. వేల ఎకరాల భూముల్లో ఈ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఉప్పునీటితో చౌడుబారిన భూముల్లో కొబ్బరి చెట్లు బతికడం లేదు. కోనసీమలోని సముద్రతీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు చచ్చుబడిపోతున్న పరిస్థితులు చూపరులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. గత కొంతకాలం నుంచి తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఆక్వా సాగు విస్తారంగా వ్యాపిస్తుండడంతో కొబ్బరి పంట కనుమరుగవుతోంది. ఎక్కడికక్కడే చెట్లు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల తెగుళ్లు వ్యాపించి కాయలు కూడా కాయని పరిస్థితి.

  ఇది చదవండి: ఏపీలో పెళ్లిళ్లు, శుభకార్యాలపై కఠిన ఆంక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు


  ఈ ఊళ్లలోనే..?
  సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంత భూముల్లో వేల ఎకరాల పంట పాడైపోయింది. ఇంకా మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం వంటి తీరప్రాంత గ్రామాల్లో ఆక్వా సేద్యం కారణంగా వేల ఎకరాల భూముల్లో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు ఎన్నిరకాల చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. ఇటీవల తీరప్రాంతంలో ఆక్వాసాగు పెరగడంతో సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకురావడంతో ఆ ప్రాంతంలోని భూములన్నీ ఉప్పుగా మారడంతో చెట్లు బతికే పరిస్థితి కనిపించడం లేదు.

  ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై జాబ్ అలర్ట్స్ చాలా ఈజీ..


  ఇదే పరిస్థితి కొనసాగితే తీర ప్రాంతంలో కొబ్బరిచెట్ల నాశనమవుతాయని అంటున్నారు అంబాజీపేట కొబ్బరి వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త బీవీకే భగవాన్‌. అంతర్వేది పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లకు ఈ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఆక్వా చెరువులకు ఉపయోగించే ఉప్పునీటి బోర్ల వల్ల తమ కొబ్బరితోట సర్వనాశనమైందని కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఆక్వాసేద్యం వల్లే కొబ్బరితోటలు పూర్తిగా చనిపోతున్నాయని తీరప్రాంత గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వాసేద్యంలో యాంటీబయోటిక్స్‌, కీటకనాశనకారి రసాయనాలు యథేచ్ఛగా ఉపయోగించడం ద్వారా భూగర్భ నీరు కలుషితమై కొబ్బరి పంట పాడవుతోందని రైతులు అంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: