P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18
గోదావరి. ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తున్న అతిపెద్ద నది. ఉభయగోదావరి జిల్లాలకు అమ్మలాంటింది. లక్షలాది ఎకరాల పంటలు, కోట్లాది మంది దాహం తీరుస్తోందీ గోదావరి. కానీ వానాకాలం వచ్చిందంటే చాలు.. నదీ పరివాహక ప్రాంతాలన్నీ వరదల ధాటికి జలమయం కావాల్సిందే..! గోదావరి ఉగ్రరూపానికి రెండు జిల్లాలు వణకాల్సిందే. కానీ భవిష్యత్తులో రెండు జిల్లాలకు వరదముప్పు నుంచి కాస్త ఉపశమనం రానుంది. ముఖ్యంగా కోనసీమకు వరదలు తగ్గనున్నాయి. దానికి ముఖ్యకారణం పోలవరం ప్రాజెక్టు. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల దిగువ భాగంలో వరద ప్రభావం బాగా తగ్గింది. కానీ ఎగువభాగంలోని ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత దిగువకు వరద ప్రభావం బాగా తగ్గుతుంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరి ఉగ్రరూపం కూడా దాల్చే అవకాశాలు తక్కువ. కోనసీమకు కూడా ఇక ఏటిగట్లను తోచేసేటంత వరద ఉండదేమో.
పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రిజర్వాయర్ పూర్తిగా నిండిపోతేనే మిగిలిన నీటిని కిందకు వదులుతారు. అందువల్ల అది ఏజెన్సీ గ్రామాలను పాపికొండలు, అడవులను ముంచేస్తుంది. అక్కడి గిరిజనుల ఉనికినే మార్చేస్తుంది. అదే సమయంలో పోలవరం దిగువ రాజమహేంద్రవరం గోదావరిలోని లంకలు, కోనసీమలోని లంకలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఎగువ కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే వరద ప్రభావంలో పెద్ద మార్పులు వచ్చాయి. భద్రాచలం వద్ద సుమారు 49 అడుగుల వరకూ నీటిమట్టం నమోదైతే, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యేది. అప్పుడు రాజమహేంద్రవరం గోదావరిలోని కేతావారిలంక, బ్రిడ్జిలంక వంటివన్నీ కనిపించేవి కావు. కోనసీమలో ఏటిగట్ల వరకూ వరద వచ్చేది. అంతకుమించి వస్తే ఏటిగట్ల మీద కూడా ప్రభావం చూపేది.
తాజాగా కాఫర్‌డ్యామ్ వల్ల సుమారు 32 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. స్పిల్‌వే గుండా సుమారు 9 లక్షల క్యూసెక్కులలోపు వరద ప్రభావం కిందకు వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి మర్నాడే ఎత్తేశారు. సాధారణంగా ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గానీ, 11.75 అడుగుల నీటిమట్టంగానీ నమోదు అయితే మొదటి వార్నింగ్ జారీ చేస్తారు. వాస్తవానికి పోలవరం కాఫర్ డ్యామ్ లేకపోతే ముందుగానే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఏర్పడేది. కానీ కాఫర్‌డ్యామ్ వల్ల భద్రాచలం నుంచి వచ్చేనీరు ధవళేశ్వరం బ్యారేజీకి రావడానికి ఆలస్యమవుతోంది. దీని వల్ల భారీ వరద వస్తేనే దిగువ భాగంలో ప్రభావం ఉండవచ్చు.
సాధారణంగా ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గానీ, 11.75 అడుగుల నీటిమట్టంగానీ నమోదు అయితే మొదటి వార్నింగ్ జారీ చేస్తారు. వాస్తవానికి పోలవరం కాఫర్ డ్యామ్ లేకపోతే ముందుగానే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఏర్పడేది. కానీ కాఫర్‌డ్యామ్ వల్ల భద్రాచలం నుంచి వచ్చేనీరు ధవళేశ్వరం బ్యారేజీకి రావడానికి ఆలస్యమవుతోంది. దీని వల్ల భారీ వరద వస్తేనే దిగువ భాగంలో ప్రభావం ఉండవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Godavari river, Polavaram