హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: గోదారోళ్లా మజాకా...! కోడలికి 10 టన్నుల స్వీట్లు పంపిన మామగారు..

Andhra Pradesh: గోదారోళ్లా మజాకా...! కోడలికి 10 టన్నుల స్వీట్లు పంపిన మామగారు..

తూర్పుగోదావరి జిల్లాలో ఔరా అనిపిస్తున్న శ్రావణం సారె

తూర్పుగోదావరి జిల్లాలో ఔరా అనిపిస్తున్న శ్రావణం సారె

గోదావరి జిల్లాల్లో మర్యాదలు, పట్టింపులు కాస్త ఎక్కువ. ఇద్దరు వియ్యంకులు మాత్రం పోటీపడి మరీ కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు.

ఆంధ్రప్రదేశ్ లో సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో పద్దతులు, పట్టింపులు ఎక్కువ. ముఖ్యంగా తెలుగు ఇళ్లలో అల్లుడికి ఇచ్చే మర్యాద.. కోడలికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. పెళ్లైన కొత్తలో వచ్చే తొలి పండుగలు, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, సంక్రాంతి ఇలా ప్రతి విశేషాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. పెళ్లి సమయంలో కొందరు అల్లుడుకి భారీమొత్తంలో కట్నకానుకలు సమర్పిస్తుంటారు. పెళ్లి తర్వాత పంపే సారె గురించి చాలా మంది చర్చించుకుంటుంటారు. వివాహం ఎలా జరిగింది అనేదానికంటే.. అల్లుడుకి ఏమిచ్చారు.. ఎంతిచ్చారు.. కోడలికి ఎంత బంగారం పెట్టారనేవాటిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. గోదావరి జిల్లాల్లో ఇలాంటి మర్యాదలు, పట్టింపులు కాస్త ఎక్కువ. ఇద్దరు వియ్యంకులు మాత్రం పోటీపడి మరీ కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన బత్తుల బలరామకృష్ణ అనే వ్యాపారి తన పెద్ద కుమార్తె ప్రత్యూషను యానాంకు చెందిన తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు ఇచ్చి ఈ ఏడాది మేలో పెళ్లి చేశారు. ఆషాఢ మాసాంలో కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన రామకృష్ణ.. అల్లుడుకి టన్ను చొప్పున పండుగప్ప చేపలు, రొయ్యలు, బొమ్మిడాయి. అరటన్ను కొర్రమీను చేపలు, 10 పొట్టేళ్లే, 50 పందెం పుంజులు, వందల రకాల స్వీట్లు, టన్ను కూరగాయలు, నిత్యావసర సరుకులతో సారె పంపించారు. లారీల్లో వెళ్లిన ఆషాఢం సారె రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇది చదవండి: భవిష్యత్తులో విశాఖ కనుమరుగుకానుందా...? నాసా సంచలన నివేదిక..


వియ్యంకుడు పంపిన సారెకు ఉబ్బితబ్బిబ్బైన తోట రామకృష్ణ.. తన వంతు కోసం ఎదురుచూశారు. బత్తుల వారే ఎంత పంపితే.. తోటవారు ఇంకెంత పంపాలి అని ఆలోచించారో ఏమో.. ఆషాఢ మాసం ముగియడం.. శ్రావణమాసం రావడంతో వియ్యాలవారిని కానుకలతో ముంచెత్తారు. ఏకంగా 10వేల కిలోల 20 రకాల స్వీట్లు పంపారు. ఇందులో తాపేశ్వరం కాకినాడ కాజాలు, లడ్డూలు, ఇతర స్వీట్లున్నాయి. అలాగే 100 అరెటి గెలలు, చీరలు, రవికలు, వివిధ రకాల పండ్లు, పూలు, ఇతర కానుకలు పంపారు.


ఇది చదవండి: ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్... ఇలా చేస్తేనే వచ్చేనెల సరుకులు

పెళ్లి ఘనంగా చేయాలని భావించినా కరోనా కారణంగా సింపుల్ గా చేశామని.. అందుకని తమ తాహతుకు తగ్గట్లు సారె పంపినట్లు బత్తుల రామకృష్ణ అన్నారు. తెలుగు సాంప్రదాయాలను కాపాడలనే ఉద్దేశంతోనే కాస్త ఖర్చు ఎక్కువైనా సారెను భారీగా పంపినట్లు తెలిపారు. మొత్తానికి వియ్యంకులిద్దరూ ఇచ్చిపుచ్చుకోవడంలో పోటీ పడుతుండటం చర్చనీయాంశమైంది. ఇక పెళ్లైన తర్వాత వచ్చే మొదటి సంక్రాంతికి మామగారు అల్లుడుకి ఎలాంటి కానుకలిస్తారనేదానిపై గోదావరి జిల్లాల్లో ఇప్పటికే చర్చ జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Rajahmundry S01p08

ఉత్తమ కథలు