హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra pradesh: తూర్పుగోదావరి జిల్లాలో వింత దూడ జననం.. పరుగులు పెడుతున్న జనం

Andhra pradesh: తూర్పుగోదావరి జిల్లాలో వింత దూడ జననం.. పరుగులు పెడుతున్న జనం

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పిఠాపురం మండలం, రామపర్తి గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే రైతుకు చెందిన గెద ఆరుకాళ్ల దూడకు జన్మనివ్వడంతో స్థానికులు వింతగా తిలకించారు.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పిఠాపురం మండలం, రామపర్తి గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే రైతుకు చెందిన గెద ఆరుకాళ్ల దూడకు జన్మనివ్వడంతో స్థానికులు వింతగా తిలకించారు.

Andhra Pradesh: ఈ భూమ్మీద ప్రతి రోజూ ఎఖ్కడో ఏదో వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది. మూజు కాళ్ల కోళ్లు, రెండు తలల పాములు, మూడు కాళ్ల ఆవులు ఇలా పుడుతూనే ఉంటాయి.

  భూమ్మీద ప్రతి రోజూ ఎఖ్కడో ఏదో వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది. మూజు కాళ్ల కోళ్లు, రెండు తలల పాములు, మూడు కాళ్ల ఆవులు ఇలా పుడుతూనే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలకు కొదవే లేదు. ఏదైనా జంతువు కాస్త తేడాగా పుడితే చాలు జనం పరుగులు పెడుతుంటారు. ఇప్పుడు ఆలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పిఠాపురం మండలం, రామపర్తి గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే రైతుకు గేదెలున్నాయి. అందులోని ఓ గేద నిన్న రాత్రి ఈనింది. గేదె ఈనిందని ఆనందంలో ఉన్న సూరారెడ్డి.. దూడను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే దూడకు ఆరుకాళ్లున్నాయి. సాధారణంగా గేదెలకు నాలుగు కాళ్లే ఉంటాయి. దీనికి ఆరు కాళ్లు ఉండటం చూసి ఆశ్యర్యపోవడంతో సూరారెడ్డి వంతైంది.

  ముందున్న రెండు కాళ్ల మధ్యలో ఓ కాలు, వెనుకున్న రెండుకాళ్ల మధ్యలో మరో కాలు అదనంగా ఉన్నాయి. విషయం ఆ నోటా ఈనోటా ఊరంతా తెలియడంతో ఆ వింత దూడను చూసేందుకు జనం పరుగులు పెడుతున్నారు. రైతు ఇచ్చిన సమాచారంతో దూడను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి దూడలు జన్మిస్తాయని.. ఇందులో వింతేం లేదని చెప్తున్నారు. ఇలా జన్మించిన దూడలు త్వరగా చనిపోయే అవకాశముందన్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

  పశువైద్యులు జన్యు లోపమని చెప్పినా స్థానికులు మాత్రం అది వింత దూడేనంటున్నారు. కొంతమంది ఓ అడుగు ముందుకేసి కలియుగం, కాకరకాయ అంటూ కబుర్లు కూడా చెప్తున్నారట. మొత్తానికి ఎక్స్ ట్రా కాళ్లేసుకొని భూమ్మీదకు వచ్చిన ఆ బుల్లి దూడ ఓ రోజంతా జనాల్ని పరుగులు పెట్టించింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, East Godavari Dist, Rajahmundry S01p08, Telugu news

  ఉత్తమ కథలు