ఏపీ, తెలంగాణలో వానలు... ప్రాజెక్టులకు జలకళ... రైతులు హ్యాపీ

Rains in AP, Telangana : ఇలాంటి వాతావరణం కోసం మనం రెండు నెలలుగా ఎదురుచూశాం. మనం కంటే ఎక్కువగా రైతుల చూపులన్నీ ఆకాశంవైపే సాగాయి. మొత్తానికి ఇప్పుడు వానలు పడుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి. అవుట్ ఫ్లోలు కూడా మొదలయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 6:07 AM IST
ఏపీ, తెలంగాణలో వానలు... ప్రాజెక్టులకు జలకళ... రైతులు హ్యాపీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎగువ నుంచీ వరద నీరు బాగా వస్తుండటంతో... కృష్ణా నది ఉప్పొంగుతోంది. జూరాల జలాశయం పూర్తిగా నిండిపోవడంతో 24 గేట్లు ఎత్తి... శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటిని రిలీజ్ చేశారు. మొత్తం 1.85 లక్షల క్యూసెక్కులు... శ్రీశైలానికి చేరాయి. దాంతో... ప్రాజెక్టులో నీటి మట్టం 822 అడుగులకు చేరింది. ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగుల వరకూ నీటిని నిల్వ చెయ్యగలదు. ఇన్‌ఫ్లో బాగా వస్తుండటంతో... అధికారులు అప్రమత్తమై... జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

కృష్ణా నది నీరు ఇలాగే మరో రెండు వారాలు జోరుగా వస్తే... రాయల సీమ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. ఐతే... నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం నీరు లేవు. ప్రస్తుతం నీటి నిల్వ 506 అడుగులకు తగ్గిపోయింది. డెడ్ స్టోరేజీ 510 కంటే పడిపోయింది. ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ఇప్పుడు కృష్ణా నది నీరు బాగా పెరిగి... శ్రీశైలం నుంచీ అవుట్ ఫ్లో మొదలైతే తప్ప... నాగార్జున సాగర్‌కి నీరు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ ఆగస్టులో శ్రీశైలం నుంచీ సాగర్‌కు నీటిని వదిలారు. ఈసారి కూడా అలా జరగాలని అందరూ కోరుకుంటున్నారు.

గోదావరి పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటికే ఉప్పొంగిన ఆ నది... ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఐతే... ఇప్పటికే గోదావరి ఉద్ధృత రూపం వల్ల చాలా గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామ చంద్రాపురం మండలాలు నీటిలోనే ఉన్నాయి. అక్కడి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. రాజమండ్రి దగ్గర కాటన్ బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేశారు. రోజూ లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఐదు రోజుల లెక్క చూస్తే... దాదాపు 20 లక్షల క్యూసెక్కుల వరద నీరు వేస్టుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఆ పోలవరం పూర్తై ఉంటే, ఆ నీరంతా నిల్వ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఆ నీటిని ఇతర జిల్లాలకు మళ్లించే అవకాశం ఉండేది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. నాట్లు వేసి... ఖరీఫ్ సాగు చేపట్టారు. వచ్చే వాన నీటిని ఒడిసి పడుతూ... చెలమలు, గొయ్యిలు, బావుల్లోకి నీటిని పంపిస్తూ... వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యారు. వర్షాలు ఇలాగే మరికొన్నాళ్లు కురిస్తే... పంటలు బాగా పండే అవకాశం ఉంది. ఐతే... భారీ వర్షాలు కురిస్తే మాత్రం అవే పంటలు నీట మునిగే ప్రమాదం కూడా ఉంది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు