Weather Update: ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

  • Share this:
    మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది.దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఈ కారణంగా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

    ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: