24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు

రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

news18-telugu
Updated: January 8, 2020, 8:11 AM IST
24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాపైకి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ తూర్పుగాలుల ప్రభావం కొంతమేర తగ్గడంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా మాత్రమే వర్షాలు కురిశాయి.  మంగళవారం సాయంత్రం వరకు మార్కాపురం, దాడితోటల్లో ఒక్కొక్క సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య గాలులతో ఉత్తర కోస్తాలో చలి స్వల్పంగా పెరిగింది. అయితే మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కళింగపట్నంలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Published by: Sulthana Begum Shaik
First published: January 8, 2020, 8:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading