హోమ్ /వార్తలు /andhra-pradesh /

ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణలోని చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని అధికారులు చెప్పారు.

    బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడును భారీ వర్షాలు వణికించాయి. వానల కారణంగా ఇప్పటికే పదులసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మరోవైు ఏపీ, తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణలోని చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయని అధికారులు చెప్పారు. ఇవాళ కూడా తేలికపాటి జల్లులు కురువనున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి పొడి వాతావరణం ఉంటుందన్నారు.

    ఏపీలో గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో వానలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అకాల వర్షాల దెబ్బకు రైతులు మాత్రం విలవిలలాడుతున్నారు. చేతికొచ్చే సమయానికి పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు