ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన..

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణమైందని, ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొంది. ఇదిలావుంటే.. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

    దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈరోజు, సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతం విషయానికొస్తే.. ఈ రోజుతో పాటు సోమవారం, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురవనున్నట్టు అమరావతి వాతవరణ కేంద్రం ప్రకటించింది.
    First published: