హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో పలుచోట్ల వర్షాలు.. కోస్తా తీరంమీదుగా ఉపరితల ఆవర్తనం

ఏపీలో పలుచోట్ల వర్షాలు.. కోస్తా తీరంమీదుగా ఉపరితల ఆవర్తనం

నిన్నటి నుంచి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, కైకలూరు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కోస్తాతో పాటు... ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, కైకలూరు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఉపరితల వర్తనం లక్ష్యదీప్ నుంచి ఉత్తర మద్య ప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలం ఆవర్తనం ఉంది. ఈ ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో 24 గంటలు కొనసాగుతుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పుడు ఎండలు తీవ్రంగా ఉండటంతో సీమ వాసులు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు ఇంకెంత మండిపోతాయోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిశాయి. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా మీదుగా కోస్తా వరకు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగింది.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Rain alert, Rainfall

    ఉత్తమ కథలు