హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhrapradesh Weather Alert: ఏపీకి మరో తుఫాను హెచ్చరిక.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

Andhrapradesh Weather Alert: ఏపీకి మరో తుఫాను హెచ్చరిక.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నివర్ తుఫాన్ దెబ్బ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. బుధ, గురు వారాల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముననట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  నివర్ తుఫాన్ దెబ్బ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. బుధ, గురు వారాల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముననట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళఖాతం, దాని అనుసంధానంగా నైరుతి బంగాళఖాతంలో తీవ్ర వాయు గుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అది మంగళవారం రాత్రి తుఫానుగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బుధవారం రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కే. కన్నబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

  వాతావరణ శాఖ సూచనల ప్రకారం బుధ, గురు వారాల్లో దక్షిణ కోస్తాలో అక్కడడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల దృష్ణ్యా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Cyclone alert, Heavy Rains, Rain alert

  ఉత్తమ కథలు