నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వడగాలులూ వీచే అవకాశం..

రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Share this:
    తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అటు.. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొన్నందున ఏపీలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వివరించారు.

    ఇదిలా ఉండగా, రాష్ట్రానికి ఎంఫాన్ తుఫాన్‌ ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. వాతావరణ శాఖ నుంచి సమాచారం సేకరించింది. అయితే, ఈ నెల 8వ తేదీన తుఫాన్‌పై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: