Andhra Pradesh Rain Alert | తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అయితే ప్రతి రోజూ వర్షాలు దంచి కొడుతున్నాయి. తాజాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం (AP, Telangan Weather Alert) ఉందని అమరావతి (Amaravathi) వాతావరణ కేంద్రం ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలలో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో గురు, శుక్ర, శని వారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవరా రోజుల్లో ఉత్తరాంధ్రతో పాటు, కృష్ణా, (krishna distirct) గుంటూరు (gunturu) జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిశాయి. దీంతో రహదారులు జలమయమ్యాయి. లోతట్లు ప్రాంతాలు వరద నీటితో ముగినిపోయాయి. విజయవాడలో భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బందరు రోడ్డ్లు చెరువులను తలపించాయి. బెంజి సర్కిల్‌లో వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం కలిగింది. ఉత్తరాంధ్రలో రహదారులు అన్నీ బురదమయంగా జారాయి. కొన్ని గ్రామాల్లో చెరువు కట్టలు తెగిపడ్డాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఇప్పుడు మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమమత్తయ్యారు. అంటు వ్యాధులు వచ్చే అవకాశాలుండటంతో నివారణ చర్యలు చేపడుతున్నారు.
ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతం, యానం, దక్షిణ కోస్తా ప్రాంతం వెంబడి వర్షాలు స్వల్పంగా పడే అవకాశం ఉందని వివరించారు. ప్రధానంగా పశ్చిమ దిశ నుంచి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తుంటాయని అధికారులు చెప్పారు. హిందూపురం చిలమత్తూరు మండలంలో భారీ వర్షాలు రైతాంగానికి ఊరటనిచ్చాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెరువులు, వాగులు, వంకలకు భారీగా నీరు చేరింది. చెక్ డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు నిండాయి.
ఇదీ చదవండి: అరుదైన కింగ్ కోబ్రాను చూసి హడలిపోయిన అధికారులు.. ఎక్కడంటే..?
ఇక తెలంగాణలో ఇప్పటికే భారీగా వర్షాలు పడుతున్నాయి. రేపు, ఎళ్లుండి కూడా పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలో కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Rain alert, Telangana, Weather report