AP Rain Alert: ఏపీని ఇప్పటికే పలు చోట్ల వానలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చిరకలు చేసింది. ఏపీకి భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకోనున్నాయని వెల్లడించింది. ఇప్పటికే రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అయితే రానున్న 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 10న కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది..
ఇదీ చదవండి: శ్మశానంగా మార్చి మిజోరాం వెళ్లమంటారా? సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ తో పాటు.. మహారాష్ట్ర, గోవా, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహిలో వర్షపాతం ఉంటుందని వివరించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్, ఒడిశాలో అతి భారీ వర్షాలు ఉండే అవాకాశాలు ఉన్నాయి. విదర్భ, చత్తీస్ గఢ్‌లో ఈ సారి ఎక్కువ ఎఫెక్టు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపటి నుంచి జమ్ముకశ్మీర్, లడాఖ్‌లో.. 11, 12వ తేదీల్లో పంజాబ్‌లో ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ నిపులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామపై అనర్హత వేటు లేనట్టేనా..? లోక్ సభ స్పీకర్ తీరుపై వైసీపీ అసహనం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, WEATHER, Weather report