• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • RAIN ALERT FOR ANDHRA PRADESH LOW PRESSURE HIGH IN THE BAY OF BENGAL IMD PREDICTS HEAVY RAINS FOR ANDHRA PRADESH FOR 3 DAYS NK

Rain Alert in AP: ఏపీకి భారీ వర్ష సూచన... 17 వరకూ దంచికొట్టుడే

Rain Alert in AP: ఏపీకి భారీ వర్ష సూచన... 17 వరకూ దంచికొట్టుడే

Rain Alert in AP: ఏపీకి భారీ వర్ష సూచన... 17 వరకూ దంచికొట్టుడే

Rain Alert in AP: బంగాళాఖాతం పక్కనే ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పుడప్పుడూ భారీ వర్షాల సమస్య తప్పదు. తాజాగా మరోసారి అదే పరిస్థితి వస్తోందంటున్నారు వాతావరణ అధికారులు.

  • Share this:
    Rain Alert in Telugu States: ఉత్తర ఆంధ్ర తీరానికి దగ్గర్లో బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడింది. దానికి అనుబంధంగా అక్కడే ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఇవాళ అల్పపీడనం మరింత బలపడుతుందనే అంచనా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావం వల్ల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ నెల 17 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published: