దసరా సందర్భంగా ప్రయాణికులకు, వారిని సాగనంపడానికి వచ్చేవారికి రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.30 చేసింది. సాధారణంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉంది. అయితే, ఈ రోజు నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 వసూలు చేస్తారు. అయితే, అది కేవలం మూడు స్టేషన్లలోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అంతా ఇంతా ఉండదు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో వాహనాలు క్రిక్కిరిసిపోతుంటాయి. రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు పెంచింది. అక్టోబర్ 10 తర్వాత మళ్లీ పాత రేట్లనే అమలు చేస్తారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.