ఆంధ్రా కాశ్మీర్ అరకు. అరకు అందాలు చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. దట్టమైన పొగమంచు, అందమైన లోయలు, ఆహ్లాదాన్ని గొలిపే వాతావరణం అరకు సొంతం. శీతాకాలంలో అరకు అందాలను ఆస్వాదించేందుకు తెలుగురాష్ట్రాలే కాదు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. అరకు టూర్ లో కిరండూల్ ఎక్స్ ప్రెస్ కీలకం. ఈ ట్రైన్లో వెళ్లి అరకు అందాలను ఎంచక్కా ఆస్వాదించవచ్చు. లాక్ డౌన్ కారణంగా ఈ ట్రైన్ ను రైల్వే శాఖ నిలిపేసింది. పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఈ రైలును పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఐతే ఈ ట్రైన్ లో అందర్నీ విశేషంగా ఆకర్షింటే విస్టాడోమ్ బోగినీ మాత్రం అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రకటించారు. అద్దాలతో రూపొందించిన విస్టాడోమ్ బోగీ నుంచి అరకు అందాలు అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి. కొండలు, గుహల్లో నుంచి ప్రయాణం సాగిస్తుంది.
విశాఖపట్నం-కిరండూల్(08514) స్పెషల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఈ నెల 18 నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 8.45 గంటలకు కిరండూల్ చేరుకుంటుంది. బీ కిరండూల్-విశాఖపట్నం(08513) ప్రత్యేక రైలు ఈ నెల 19 నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు కిరండూల్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.బీ 8 సెకండ్ క్లాస్ రిజర్వేషన్ బోగీలు, 2 జనరల్ సెకండ్ క్లాస్ రిజర్వేషన్)కమ్ లగేజి బోగీలతో ఈ రైలు సింహాచలం, కొత్తవలస, అరకు, కోరాపుట్, జైపుర్, జగదల్‌పుర్, దంతెవాడ, బచేలి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
విశాఖ నుంచి అరకు-పాడేరు-లంబసింగిని సందర్శించేందుకు నవంబర్ నుంచి జనవరి వరకు వేలాది మంది యాత్రికులు వెళ్తుండగా.. గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు, అరకులోయ, పాడేరు, చింతపల్లి, లంబసింగి, కొత్తపల్లి జలపాతం, చాపరాయి జలపాతాలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ మిరియాలు, యాపిల్, స్ట్రాబెర్రీ తోటలు చూసేందుకు పర్యాటకులు ఉత్సాహపడతారు. ఇక్కడి బొంగు చికెన్ చాలా ఫేమస్. అరకు టూరిజం కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందుకోసం రిసార్టులను కూడా అందుబాటులో ఉంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap tourism, Araku, Visakha Railway Zone, Vizag