Home /News /andhra-pradesh /

RAILWAY POLICE ARRESTED TWO THIEVES IN GUNTUR RAILWAY STATION UMG

బిల్డప్ బాబాయ్‌లు.. ఏసీ బోగీల్లో పాడు పనులు.. రాత్రిళ్లు ఆడవాళ్లు పడుకున్న తర్వాత.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పల్నాడు (Palnadu) జిల్లా మాచర్లకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, ప్రకాశం (Prakasam) జిల్లా కురిచేడుకు చెందిన హరికృష్ణ మంచి స్నేహితులు. ఐదో తరగతి వరకు చదివిన వీళ్లిద్దరూ ఎలాగైనా గొప్పోళ్లు అవ్వాలని అనుకున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేయాలని అనుకున్నారు. దాంతో రైళ్లలో ఏసీ బోగీల్లో అయితే బాగా డబ్బున్న వాళ్లు ఉంటారని ఆ బోగీల్లోనే ప్రయాణించేవారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India
  నీట్‌గా సూటూ బూటు వేసుకుని కాస్తంత స్టయిలిష్‌గా ఉంటే చాలు.. అబ్బో చాలా గొప్పోడిలా ఉన్నాడే, బాగా చదువుకుని ఉంటాడు.. ఇదిగో ఇలా మనలో మనమే అన్నీ అల్లేసుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఇలా అప్పీయరన్స్ చూసే మోసపోతున్నారు. మనకి చూడటానికి క్లాస్‌గా కనిపిస్తే మంచోడు, కాస్త మాస్‌గా కనిపిస్తే చెడ్డోడు అనే ఫీలింగ్‌లో ఇంకా కొందరు ఉన్నారు. అలాంటి వాళ్లని బురిడీ కొట్టించేందుకు ఇలాంటి బిల్డప్ (Build up) బాబాయ్‌లు తిరుగుతూ సర్వం దోచేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

  వారిద్దరూ స్నేహితులు (Friends).. చదివింది ఐదో తరగతి వరకే కానీ దేశాన్ని దోచే తెలివితేటలు ఉన్నాయి. హై క్లాస్ దొంగతనం చేయాలనే ఆలోచనలతో టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఏసీ బోగీ (AC Trains)ల్లో ఎక్కేస్తారు. అందరూ పడుకున్న తర్వాత ముఖ్యంగా ఆడవాళ్లని (Womans) టార్గెట్ చేసి నగలు దోచుకుని దర్జాగా రైలు దిగేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత వచ్చిన దాంట్లో సగం సగం తీసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇటీవల రైళ్లలో దోపిడీలు ఎక్కువవడంతో రెక్కీ పెట్టిన పోలీసులు ఈ కేటుగాళ్లను పట్టుకున్నారు.

  ఇదీ చదవండి: చీర కొనలేదని.. చున్నీతో ఉరేసుకున్న భార్య.. చివర్లో ట్విస్ట్..!


  రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు (Palnadu) జిల్లా మాచర్లకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, ప్రకాశం (Prakasam) జిల్లా కురిచేడుకు చెందిన హరికృష్ణ మంచి స్నేహితులు. ఐదో తరగతి వరకు చదివిన వీళ్లిద్దరూ ఎలాగైనా గొప్పోళ్లు అవ్వాలని అనుకున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేయాలని అనుకున్నారు. దాంతో రైళ్లలో ఏసీ బోగీల్లో అయితే బాగా డబ్బున్న వాళ్లు ఉంటారని ఆ బోగీల్లోనే ప్రయాణించేవారు.

  సాయంత్రం వరకు మామూలుగా ఉంటూ రాత్రవగానే తమ పని మొదలుపెడతారు. అప్పటికే బంగారం ఉన్న మహిళలు, పురుషులపై రెక్కీ వేసి ఉంచి.. అర్ధరాత్రి వాళ్లు మంచి నిద్రలో ఉండగా.. వాటిని అపహరించి మధ్యలోనే రైలు దిగేవాళ్లు. ఇలా దొంగతనం చేసిన సొత్తును విక్రయించి అలా వచ్చిన డబ్బుతో విమానంలో గోవా వెళ్లి జల్సా చేస్తుంటారని పోలీసులు వెల్లడించారు.  రైళ్లలో దొంగతనాలపై దృష్టి పెట్టిన రైల్వే పోలీసులకు గుంటూరు రైల్వే స్టేషన్‌లో అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
  Published by:Mahesh
  First published:

  Tags: Guntur, Prakasam, Thief Arrested, Trains

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు