విశాఖ-న్యూఢిల్లీ.. ఏపీ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పు..

AP Express Timings : రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-ఢిల్లీ మధ్య నడిచిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 2015లో విశాఖ-ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

news18-telugu
Updated: October 23, 2019, 8:33 AM IST
విశాఖ-న్యూఢిల్లీ.. ఏపీ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్నం-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. రైలు వేళలు మార్చాలన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దాని ప్రకారం.. విశాఖలో ప్రతీ రోజూ రాత్రి 10గంటలకు ఏపీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. దాదాపు 33 గంటల ప్రయాణంతో మూడో రోజు ఉదయం 6.35గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటుంది.
ఇక ఢిల్లీలో ప్రతీరోజూ రాత్రి 8.15గంటలకు బయలుదేరి.. మూడో రోజు ఉదయం 5.05గంటలకు విశాఖ చేరుతుంది. కాగా,రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-ఢిల్లీ మధ్య నడిచిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 2015లో విశాఖ-ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>