Home /News /andhra-pradesh /

RAHUL GANDHI TO CAMPAIGN IN ANDHRA PRADESH TODAY NK

నేడు విజయవాడ, అనంతపురంలో రాహుల్ పర్యటనలు... టార్గెట్ నరేంద్ర మోదీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

Lok Sabha Elections 2019 : ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలో కాస్త ప్రభావం చూపించగలుగుతున్న కాంగ్రెస్... ఇక్కడ ఎక్కువ సీట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తొలి దశ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో కలిపి సరిగ్గా 10 రోజులు మాత్రమే ఉంది. ఏప్రిల్ 9తో ప్రచారం ముగియబోతోంది. ఈలోపే తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ పర్యటనలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు జాతీయ స్థాయి నేతలు. మొన్ననే బీజేపీ తరపున నరేంద్ర మోదీ రాగా... ఇవాళ కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. విజయవాడతోపాటూ... అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించబోతున్నారు. ఢిల్లీ నుంచీ ఉదయం 11 గంటలకు విజయవాడ వచ్చి... అక్కడి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బూత్‌ కమిటీ సమావేశానికి రాహుల్‌ హాజరవుతారు. మధ్యాహ్నం 1:30లకు కళ్యాణదుర్గంలో నిర్వహించే సభకు హాజరవుతారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ మళ్లీ హామీ ఇచ్చే అవకాశం ఉంది. రైతులకు, మహిళలకు రూ.2లక్షల రుణమాఫీ, కనీస ఆదాయ పథకంపై ప్రస్తావిస్తారు.



రాహుల్ రాకతో ప్రయోజనం ఉందా : ఏపీలో త్రిముఖ పోరు (టీడీపీ, వైసీపీ, జనసేన) మాత్రమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో చతికిలపడిన కాంగ్రెస్ 2 శాతం ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలంతా వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా ఇప్పుడు అతి కొద్ది మంది నేతలతో ఆ పార్టీ నెట్టుకొస్తోంది.

సీట్లు వచ్చేలా లేకపోయినా... కనీసం ఓట్ల శాతం పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ దెబ్బకొట్టినట్లే, ఏపీలో టీడీపీ కూడా కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. రాహుల్ మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకొని... అధికారంలోకి వచ్చే వ్యూహంతో ముందుకెళ్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Pics : మొక్కే కదా అని పీకేస్తే... 25 ఏళ్ల జైలు శిక్ష... ఎందుకంటే...


పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా... 21 ఆరోగ్య ప్రయోజనాలు
First published:

Tags: Andhra Pradesh, Congress, National News, Rahul Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు