• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • RAHAHMUNDRY PAPIKONDALU TORU TO RESUME ON APRIL 15TH BY ANDHRA PRADESH TOURISM DEPARTMENT AFTER KACHULURU BOAT TRAGEDY FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్... గోదారమ్మ పిలుస్తోంది.. ఇక ఈ సమ్మర్ మీదే..

Andhra Pradesh: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్... గోదారమ్మ పిలుస్తోంది.. ఇక ఈ సమ్మర్ మీదే..

ఏపీలో రేపటి నుంచి పాపికొండలు టూర్

Papikondalu Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆహ్లాదం కలిగించే పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు కూడా ప్రధానమైనవి. గోదారి అలల మధ్య సాగే ఈ యాత్ర ప్రతిఒక్కరికీ గుర్తుండిపోతుంది.

  • Share this:
    మండువేసవిలో చల్లని ప్రాంతానికి వెళ్లాలని అందరూ ఉత్సాహపడుతుంటారు. బాగా డబ్బున్న వాళ్లైతే ఏ స్విట్జర్లాండో చెక్కేస్తారు. లేదంటే కాశ్మీర్, అదీ లేదంటే ఊటీ వెళ్లి సేదదీరుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి ప్రజలు వెళ్లే టూర్ ఒకటుంది. అదే పాపికొండల యాత్ర. చల్లటి గోదావరి నదిలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలను వీక్షించటానికి పర్యాటకులు రాజమహేంద్రవరం వస్తూ ఉంటారు. ఇక్కడ నుండి రోజు కొన్ని వేలమంది పర్యాటకులు రోజు పాపికొండల సందర్శనలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కొండలు కోనల వంటి అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవు ఇయినా ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి పాపికొండలు. ఇవి ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను అనుకుని ఉన్నాయి. పాపికొండల ప్రాంతంలో ఉన్న చెట్లు ఆకులను రాల్చవు. అందుకే 365 రోజులు పచ్చగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతం.. చాలా ప్రశాంతగా ఉంటుంది. అందంగా రమణీయంగా ఉంటూ ఆహ్లాదం కలిగించే ప్రదేశం పాపికొండలు.

    పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడి నుండి పోలవరం, రాజమండ్రి, కూనవరం, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

    ఇది చదవండి: ఏపీలో మరోసారి లాక్ డౌన్..? ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాల్లో హై అలర్ట్..


    18 నెలల తర్వాత పునఃప్రారంభం
    ఐతే 2019 సెప్టెంబర్‌ 15న తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడం తో పటు ఎన్నో కుటుంబాలలో తీరని విషాదం మిగిల్చింది.ఆ ఘటనతో ప్రభుత్వం గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్‌ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిచింది. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాలను వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతి లభించటంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) వద్ద నుంచి బోటు బయలుదేరనుంది.

    ఇది చదవండి: వన్యప్రాణులకు సరికొత్త నేస్తం.. మండువేసవిలో దాహర్తి తీర్చే దైవం..


    రాజమహేంద్రవరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
    Published by:Purna Chandra
    First published: