Home /News /andhra-pradesh /

QUESTIONING OF ATCHANNAIDU IN ESI MEDICAL SCAM CONTINUES SECOND DAY IN GGH SK

ESI స్కామ్‌లో అచ్చెన్నాయుడిని రెండో రోజు ప్రశ్నిస్తున్న ఏసీబీ

అచ్చెన్నాయుడు (File)

అచ్చెన్నాయుడు (File)

ఏసీబీ విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు ఆయన లాయర్ హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. గురువారం కూడా సుమారు 3 గంటల పాటు అచ్చెన్నాయుడిని విచారించారు.

    ఏపీలో సంచలనం రేపిన ESI స్కామ్‌లో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడికి వైద్య పరీక్షలు చేశారు. ఎండోస్కోపి తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించి విచారణ జరుపుతున్నారు. ఏసీబీ కేంద్ర పరిశోధనా బృందం డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు ఆయన లాయర్ హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. గురువారం కూడా సుమారు 3 గంటల పాటు అచ్చెన్నాయుడిని విచారించారు. ఇవాళ కూడా సాయంత్రం 6 గంటల వరకు అచ్చెన్నాయుడిని ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు.

    కాగా, చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడుకు అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనూ ఆయన్ను విచారిస్తున్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Guntur, Kinjarapu Atchannaidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు