కృష్ణా జిల్లాలో రగడ... YCPలోని రెండు వర్గాల మధ్య గొడవ

కృష్ణా జిల్లాలో రగడ... YCPలోని రెండు వర్గాల మధ్య గొడవ

జనరల్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, నాయకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. మరి... అధికార పార్టీలోనే రెండు వర్గాల మధ్య గొడవెందుకు వచ్చింది?

  • Share this:
    కృష్ణా జిల్లా... గన్నవరం మండలం... చిన్న అవుటపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీకి చెంది చిన్న అవుటపల్లి మాజీ సర్పంచి కోట వినయ్, వైసీపీ కార్యకర్తలపై... ఎమ్యెల్యే వంశీ అనుచరుల దాడిచేశారని తెలిసింది. దీనిపై ఆత్కురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు KDCC చైర్మన్ యార్లగడ్డ వెంకటరావు. బాధితులకు తాను అండగా ఉంటాననీ, వారికోసమే పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చానని ఆయన అన్నారు. దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఐతే... పోలీసులు దర్యాప్తు చేసి... చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటరావు... దాడి చేసిన వాళ్లను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.

    దర్యాప్తు తర్వాతే అరెస్టు చెయ్యగలమని పోలీసులు చెప్పడంతో... వెంకటరావుకి చెందిన కార్యకర్తలు... తమకు న్యాయం చేయాంటూ హైవేపై కూర్చున్నారు. దాంతో... 5 కిలోమీటర్ల వరకూ వాహనాలు ఆగిపోయాయి. ప్రస్తుతం పోలీసులు... ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: