PUSPHA MOIVE INSPIRATION THREE MINORS TURNED KILLERS IN JAHANGIRPUR NORTH DELHI NGS
Pushpa Effect: పుష్ప సినిమా చూసి ఎదగాలి అనుకున్నారు.. చివరికి హంతకులుగా మారిన మైనర్లు.. ఏం జరిగిందంటే?
పుష్ప ప్రేరణతో హంతకులుగా మారిన మైనర్లు
Pushpa Effect: పాన్ ఇండియా మూవీగా పుష్ప రికార్డులు తిరగరాస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాను కొందరు ఇనిస్ప్రేషన్ గా తీసుకుంటున్నారు.. పుష్పలాగే విలన్ లా ఎదగాలి అనుకుంటున్నారు. అలాగే క్రిమినల్ గా ఎదగాలి అనుకున్న మైనర్లు.. చివరికి హంతకులుగామారారు.. ఏం జరిగిందో తెలుసా..?
Crime News: యువత(Youth) మీద సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ మధ్య కాలంలో మొత్తం అంతా హింసాత్మకంగా చూపిస్తూ... చివర్లో మెసేజ్ ఇచ్చే సినిమాలు (Movies) వస్తున్నాయి. ముఖ్యంగా హీరో (Hero)ను నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే సినిమాలు ఇచ్చే మంచి మెసేజ్ లను చూసిన ఎవరూ ప్రభావితం అవ్వడం లేదు.. కానీ నేరులకు మాత్రం అలావాటు పడుతున్నారు. అందుకు తమకు నచ్చిన సినిమాలను ఇనిస్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media), సినిమాల ప్రభావం యువత, మైనర్ల(Minors)లో ఎక్కువగా ఉంటోంది. ఎంతలా దుష్ప్రభావం చూపుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లో చూపించే అసాధారణ దృశ్యాలను ప్రేరణగా తీసుకుని ముగ్గురు మైనర్ బాలలు ఒక యువకుడిని హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది.. ఈ విషయాన్ని పోలీసులే అధికాకరికంగా నిర్ధారించారు...
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు చెప్పిన వివరాలు మేరకు ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని ఓ బస్తీలో నివాసముంటున్న ముగ్గురు కుర్రాళ్లు.. స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడ్డాడు.. సోషల్ మీడియా లో పాపులర్ కావాలని ఆరాటపడ్డారు. అదే సమయంలో పుష్ప సినిమాను చూశారు.. ఆ ప్రేరణలో తమను చూసి ఇతరులు భయపడే విధంగా ఉండాలని భావించారు.. ఇతరులు భయపడాలి అంటే ఏదైనా చేయాలనీ భావించారు. దీంతో ఒంటరిగా ఉన్న ఒక అమాయక యువకుడిని ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. అక్కడితో ఆగకుండా.. తమ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నారు. కానీ పోలీసులు కూడా ఆ వీడియోను చూస్తారన్న లాజిక్ మరిచిపోయారు.
తీవ్ర గాయాలతో పడి ఉన్న యువకుడిని జహంగీర్‌పురిలోని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలంలోని సీసీటీవీలను పరిశీలించి ముగ్గురు మైనర్ బాలలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై విచారించిన పోలీసులు.. ఆ ముగ్గురు చెప్పిన విషయాలు విని షాక్ కు గురియ్యారు. ఇటీవల వచ్చిన “పుష్ప” సినిమా, “బౌకాల్ వెబ్ సిరీస్”లను ప్రేరణగా తీసుకుని తాము నేర ప్రవృత్తిలోకి వెళ్లాలి అనుకున్నామని చెప్పారు. ఆయా చిత్రాల్లోని హీరోలలాగే ఎదగాలని భావించినట్లు ఆ ముగ్గురు బాలురు పోలీసులకు వివరించారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.