PUSHPA MOVIE SCEEN IN NELLORE FOREST SMUGGLERS TRYING TO ATTACKED ON POLICES BUT LAST WHAT HAPPENED NGS TPT
Pushpa Effect: నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్ .. చివరికి ఏం జరిగింది అంటే..?
నెల్లూరు అడవుల్లో పుష్సా సీన్
Pushpa Effect: పాన్ ఇండియా మూవీగా పుష్ప రికార్డులను బద్దలగొట్టేవారు. అన్ని రాష్ట్రాల్లో కలెక్సన్ల సునామీతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో పుష్ప నెగిటివ్ షేడ్స్ తో కనిపించడంతో.. పుష్పరాజ్ క్యారెక్టర్ ను చాలామంది ప్రేరణ గా తీసుకుంటున్నారు. మొన్న ఢిల్లీలో మైనర్లు పుష్పలా ఎదగాలి అని ఫీలై హంతకులుగా మారు.. ఇప్పుడు నెల్లూరు అడవుల్లోనూ పుష్పలాంటి సీన్ చోటు చేసుకుంది.
Pushpa Effect: ఫుష్ప సినిమా (Pushpa Movie) కేవలం తెలుగు లోనే కాదు.. దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. పుష్పరాజ్ గా అల్లూ అర్జున్ (Alluarjun) అందిర్నీ మెప్పిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా (Socila Media)లో ఎక్కడ చూసినా.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా పుష్పను అనుకరిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.. అయితే ఇదంతా ఓ కోణం అయితే.. మరికొందరు పుష్ప సినిమాలో చెడును ఫాలో అవుతున్నారు. ఇటీవల ఢిల్లీ (Delhi)లో కొందరు మైనర్లు.. పుష్పలా ఫేమస్ అవ్వడానికి ఓ యువకుడ్ని ఏ కారణం లేకుండా చితక్కొట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి అందర్నీ భయపెట్టాలి అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore District) అడవుల్లోనూ పుష్ప లాంటి సీన్ చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు (Red Smugglers) ‘పుష్ప’ సినిమా సీన్‌ను తలపించేలా పోలీసులపై రెచ్చిపోయారు. ఎర్రచందనం స్మిగ్లింగ్ ను అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసరడంతోపాటు వాహనాలను దూకించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది సినిమా కాదు.. పోలీసులను ఆగిపోమమని చెప్పడానికి అక్కడ డైరెక్టర్ ఉండడు.. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు స్మగ్లర్లు సహా 55 మంది కూలీలను అరెస్టుచేశారు.
చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన దాము అని స్మగ్లర్ గత కొద్దేళ్లుగా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. దాము దగ్గర గతంలో పనిచేసిన కుప్పన్న సుబ్రహ్మణ్యంకు పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వేలుమలైతో పరిచయం అయింది. ఆ తరువాత వేలుమలై అతని బావమరిది రాధాకృష్ణన్ పళనిని దాముకు పరిచయం చేశాడు. ఈ నెల 20న కూలీలతో వారంతా నెల్లూరు జిల్లా గూడూరుకు చేరుకున్నారు. అక్కడ వేలుమలైకు తెలిసిన కడపజిల్లా రైల్వేకోడూరుకి చెం దిన చంద్రశేఖర్‌ని కలిశారు. అతని సహకారంతో రాపూరు అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి 21వ తేదీ రాత్రి దుంగలను లారీలో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడి వరకు అంతా వారు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే అప్పటికే పోలీసులకు దానిపై సమాచారం అందింది. దీంతో ఆ రహదారిపై వచ్చే వాహనాలను తనిఖీలు చేశారు పోలీసులు..
శనివారం మధ్యాహ్నం రెండు వాహనాల్లో చెన్నై జాతీయ రహదారిలో ఎర్రచందనం దుంగలతో కూలీలు, మాఫియా సభ్యులు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. వీరిని చిల్లకూరు మండలం బూదనం గ్రామం దగ్గర నిలిపేందుకు ప్రయత్నించగా.. వాళ్లు పుష్ప సీన్లను గుర్తు తెచ్చుకున్న పోలీసులపై దాడికి దిగారు. ఏకం పోలీసులపై తమ వాహనాలను ఎక్కించేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా తమ వెంట తెచ్చకున గొడ్డళ్లను విసిరారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ వాహనాలను జీపులతో చుట్టిముట్టి నిందితులను అరెస్టు చేశారు.
స్మగ్లర్ల నుంచి 45 ఎర్రచందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 31 సెల్ఫోన్లు, 3 బరిసెలు, ఓ లారీ, టయోటో కారు, 75,230 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముందు స్మగ్లర్ల దాడిలో.. ఓ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి.. మిగిలిన వాతందా దాడి నుంచి తప్పించుకుని స్మగ్లర్లను చాకిచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లతో పాటు.. తమిళనాడుకు చెందిన 55 కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.