ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో పృథ్వీరాజ్ అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేప్ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ ఆవేశంగా మాట్లాడారు. పద్మావతి గెస్ట్ హౌస్‌లో మందుకొట్టానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అది రుజువైతే తనను చెప్పుతో కొట్టాలని చెప్పు చూపించారు పృథ్వీ. ఇప్పుడే డాక్టర్ని తీసుకొచ్చి రక్త పరీక్షలు చేయిస్తే.. తాను తాగుబోతునో కాదో తెలుస్తుందని అన్నారు.
పద్మావతి గెస్ట్ హౌస్‌లో నేను మందుకొట్టానని అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. నేను మందు తాగినట్లు రుజువైతే నన్ను చెప్పుతో కొట్టండి. డాక్టర్‌ను తీసుకొచ్చి ఇప్పుడే చెక్ చేయండి. బ్లడ్ శాంపిల్స్ తీస్తే.. నేను తాగుబోతునో కాదో తెలుస్తుంది. జగన్ సీఎం కావాలని నేను ఏడాది పాటు దీక్షలో ఉన్నా. అన్ని అలవాట్లను వదిలేశా. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని మందు తాగారని అంటే హృదాయ విదారకరంగా ఏడ్చా. శనివారం రాత్రి నుంచి మంచి నీళ్లు కూడా తాగలేదు. చాలా మనోవేదనకు గురయ్యా.
— పృథ్వీ రాజ్
ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.