ఆడియో టేప్‌ల ఎఫెక్ట్.. ఆస్పత్రి పాలైన పృథ్వీ రాజ్

ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినందుకు తాను కన్నీటి పర్యంతమయ్యానని.. ఉదయం నుంచి ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు పృథ్వీ రాజ్.


Updated: January 12, 2020, 5:28 PM IST
ఆడియో టేప్‌ల ఎఫెక్ట్.. ఆస్పత్రి పాలైన పృథ్వీ రాజ్
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ (Image: SVBC Channel)
  • Share this:
ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్ ఆడియో టేపుల వ్యవహారం తిరుమలలో తీవ్ర దుమారం రేపుతోంది. మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ల‌ు వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ సైతం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆడియో టేపుల వ్యవహారంపై వివరణ ఇచ్చారు పృథ్వీ. ఫేక్ ఆడియోతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పద్మావతి గెస్ట్ హౌస్‌లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినందుకు తాను కన్నీటి పర్యంతమయ్యానని.. ఉదయం నుంచి ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు పృథ్వీ రాజ్.

లేని పోనివి సృష్టించి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా జీవితంలో తొలిసారి ఇంతగా బాధపడుతున్నా. ఉదయం నుంచి ఆస్పత్రిలో ఉన్నా. ఎస్వీబీసీ ఛానెల్‌లో ఉన్న ఉద్యోగులు నన్ను అన్నలా చూస్తారు. అందిరినీ కుటుంబంలా భావిస్తాను. సినిమాలకు దూరంగా ఉండి స్వామి సేవలో లీనమయ్యాను. 11 ఏళ్ల నుంచి వైఎస్ జగన్‌తో పాటు ట్రావెల్ చేస్తున్నా. నాకు ఎస్వీబీసీ పదవి ఎందుకు ఇచ్చారని కొంత మంది నాపై పడి కుట్రలు చేస్తున్నారు. రైతులపై నేను చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు. నా మాటల వల్ల నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెబుతున్నా. పోసానితోనూ నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. అందులో అన్ని నిజాలు బయటకొస్తాయి.
పృథ్వీ రాజ్


ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు