హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: నిరుద్యోగుల సమస్యపై సభలో టీడీపీ ఆందోళన.. బయట ఉద్రిక్తత.. చంద్రబాబుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

AP Assembly: నిరుద్యోగుల సమస్యపై సభలో టీడీపీ ఆందోళన.. బయట ఉద్రిక్తత.. చంద్రబాబుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

తొలి రోజే అందోళనతో అట్టుడికిన అసెంబ్లీ

తొలి రోజే అందోళనతో అట్టుడికిన అసెంబ్లీ

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే రచ్చ రచ్చ అవుతోంది. జాబ్ క్యాలెండర్ ఏది అంటూ టీడీపీ నేతలు.. సభలో ఆందోళనకు దిగా.. టీడీపీ యూత్ లీడర్లు బయట నిరసనలకు దిగారు.. మరోవైపు టీడీపీ తీరుపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP Assembly:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలి రోజు నిరసనలతోనే సభ ప్రారంభమైంది. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల పై టీడీపీ (TDP) వాయిదా తీర్మానం కోరింది. వెంటనే వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. కానీ ప్రశ్నోత్తరాల తర్వాత చర్చ చేపడదాం అంటూ స్పీకర్ (Speaker) చెప్పారు. దీంతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. జాబ్‌ క్యాలెండర్‌ (Job Calendar) .. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ అయింది అంటూ నినాదాలు చేశారు. జగన్ జాబ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు.. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రులు తెలుగు దేశం నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సభ సంప్రదాయాలు పాటించకుండా టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి  (Buggana Rajendranath Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఉపాధి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) .. ప్రస్తుతం టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారని.. అందుకే చర్చకు సహకరించకుండా అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారంటూ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) మండిపడ్డారు.

సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోందని.. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అలాగే నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబబే అన్నారు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.

ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు.

సభలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగితే.. సభ భయట  కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్..

వెలగపూడి చెక్ పోస్ట్ దగ్గర ఆందోళనకు దిగారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎస్‍ఎస్‍ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‍గోపాల్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఇతర నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట.. తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు పోలీసులు. దీంతో పలువురు నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు..

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Minister Roja

ఉత్తమ కథలు