గోదావరిలో లంగరుకు తగిలినట్టే తగిలి.. చేజారిన లాంచీ

బోటు వెలికితీత కోసం నియమించిన ధర్మాడి సత్యం బృందం వేసిన ఓ లంగర్‌కు బోటు తగిలింది. దాన్ని బయటకు తీసే క్రమంలో ఆ బోటుకు ఉన్న రెయిలింగ్ ఊడి వచ్చింది.

news18-telugu
Updated: October 17, 2019, 9:54 PM IST
గోదావరిలో లంగరుకు తగిలినట్టే తగిలి.. చేజారిన లాంచీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన లాంచీ ఆచూకీ లభ్యమైంది. బోటు వెలికితీత కోసం నియమించిన ధర్మాడి సత్యం బృందం వేసిన ఓ లంగర్‌కు బోటు తగిలింది. దాన్ని బయటకు తీసే క్రమంలో ఆ బోటుకు ఉన్న రెయిలింగ్ ఊడి వచ్చింది. ఆ బోటు బరువును రెయిలింగ్ ఆపలేకపోయింది. దీంతో కొంచెం పైకి వచ్చినట్టే వచ్చి కింద పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లంగర్‌కు తగిలిన ఆ రెయిలింగ్‌ను ధర్మాడి సత్యం బృందం బయటకు తీసింది. బోటు ఎక్కడ ఉంది? ఎంత లోతులో ఉందనే విషయంపై ఓ అవగాహన రావడంతో దాన్ని బయటకు తీసేందుకు మరింత ముమ్మరంగా చర్యలు చేపట్టనున్నారు. మరో రెండు రోజుల్లో లాంచీని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు మునిగిన బోటులో ఇంకా 13 మృతదేహాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading