పవన్ కామెంట్స్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్.. పీకే ఫ్యాన్స్ ఫుల్ జోష్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ‘చర్మం ఒలిచేలా కొట్టలని పవన్ కల్యాణ్ గారు సూచించిన "బహిరంగ శిక్ష" వాస్తవానికి ఉరిశిక్ష కంటే కఠినమైన శిక్ష. ఇది రేపిస్టుల్లో భయాన్ని సృష్టిస్తుంది.’ అని కామెంట్ చేశారు.

news18-telugu
Updated: December 11, 2019, 7:04 AM IST
పవన్ కామెంట్స్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్.. పీకే ఫ్యాన్స్ ఫుల్ జోష్..
పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్
  • Share this:
దిశ నిందితులపై జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నిందితును చంపడం కంటే రెండు బెత్తం దెబ్బలు వేయాలని పవన్ చెప్పడంతో ప్రత్యర్థులు దాడికి దిగారు. రెండు బెత్తం దెబ్బలే సరిపోతాయా? రేప్ చేసి చంపేసిన వారికి అంత చిన్న శిక్షేనా? అంటూ పవన్‌పై విమర్శలు చేశారు. అయితే.. కావాలనే ఓ వర్గం మీడియా తన తమ్ముడిని టార్గెట్ చేసిందని మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ వాళ్లను చంపొద్దంటున్నాడు అంటూ ఓ మీడియా వర్గం ప్రత్యేకంగా వేసారంటూ నాగబాబు సీరియస్ అయ్యాడు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా సోషల్ మీడియాలో వక్రీకరణకు లోనయ్యాయంటున్నాడు ఈయన. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటైతే సోషల్ మీడియాతో పాటు జగన్ మీడియా సంస్థలు మరోలా ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డాడు.

ఇదిలా ఉండగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ‘చర్మం ఒలిచేలా కొట్టలని పవన్ కల్యాణ్ గారు సూచించిన "బహిరంగ శిక్ష" వాస్తవానికి ఉరిశిక్ష కంటే కఠినమైన శిక్ష. ఇది రేపిస్టుల్లో భయాన్ని సృష్టిస్తుంది.’ ట్విట్టర్‌లో అని కామెంట్ చేశారు. ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘చర్మం ఒలిచేలా, రక్తం కారుతుండగా.. బహిరంగంగా శిక్ష వేస్తే అది ఉరి శిక్ష కన్నా ఎక్కువ బాధను అనుభవిస్తాడు. పోలీసుల లాఠీ దెబ్బ తింటే తెలుస్తుంది. ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పీకే ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ నాయకుడు ఈ కోణంలోనే ఆ వ్యాఖ్యలు చేశాడని, కానీ.. కొందరు దాన్ని వక్రీకరించారని అంటున్నారు.First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>