పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...

AP Assembly Election Counting 2019 : తమ్మారెడ్డి భరద్వాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మెచ్చుకున్నారా, విమర్శించారా... టైటిల్‌ ఒకలా పెట్టి, విశ్లేషణ మరోలా ఎందుకు చేశారన్నది వ్యూవర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 12:04 PM IST
పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...
పవన్ కళ్యాణ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ్ విమర్శలు (Image : Tammareddy Bharadwaj / Twitter)
  • Share this:
Producer Tammareddy Bharadwaj : రాజకీయాలపై అప్పుడప్పుడూ తనదైన శైలిలో స్పందించే టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్... తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను నా ఆలోచన పేరుతో యూట్యూబ్‌లో అందిస్తున్న తమ్మారెడ్డి... ముందుగా ఎన్నికల బెట్టింగ్‌పై స్పందించారు. ఈ బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ, చాలా మంది అప్పులు చేసి మరీ పందేలు కాసి అడ్డంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, ఎన్నికలు ఇలా ప్రతీ అంశంపైనా తెలుగు రాష్ట్రాల ప్రజలు పందేలు కాస్తుండటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రాజకీయం ఓ వ్యాపారమైపోయిందన్న తమ్మారెడ్డి భరద్వాజ్... అదే రాజకీయ నాయకులపై జరుగుతున్న బెట్టింగ్ కూడా వ్యాపారంలా తయారై నష్టాలు తెస్తోందన్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై స్పందించిన తమ్మారెడ్డి... జనసేన పార్టీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంచలనం రాబోతోందనీ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అవినీతిని కడిగిపారేస్తాడని అనుకుంటే... తుస్సు మనిపించాడని విమర్శించారు. బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్... తనకంటూ పార్టీని సొంతంగా అభివృద్ధి చేసి ఉంటే బాగుండేదన్న ఆయన... అలా చెయ్యకపోవడం సరి కాదన్నారు. టీడీపీకి సపోర్ట్ రద్దు చేశాక... చంద్రబాబు, లోకేష్‌పై సీరియస్‌గా మాట్లాడిన పవన్ కళ్యాణ్... ఆ తర్వాత సడెన్‌గా సైలెంటైపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్‌ని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేయడం కరెక్టు కాదన్న తమ్మారెడ్డి... పవన్ కళ్యాణ్... టీడీపీ, వైసీపీ రెండింటినీ విమర్శించాలని అన్నారు.

తనను నమ్మిన ప్రజలను పవన్ కళ్యాణ్ నిరాశ పరిచారన్న తమ్మారెడ్డి... ఆయనలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే... ఆయనలో స్థిరమైన నిశ్చితాభిప్రాయం కనిపించట్లేదని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి. ఈ ఎన్నికల్లో జనసేన సత్తా చాటలేకపోతే దానికి పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్‌దే అవుతుందన్నారు భరద్వాజ్.

 

ఇవి కూడా చదవండి :

500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...

కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...

అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్
First published: May 17, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading