PRODUCER NATTI KUMAR KEY KEY COMMENTS ON MINSTER PERNI NANI AND RAM GOPAL VARMA MEETING NGS
RGV: సినిమాల్లేకే టైం పాస్ చేస్తున్నారు.. ఇదంతా ఐదుగురి గేమ్ ప్లాన్
వర్మ
RGV–Perni Nani Meeting: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ–మంత్రి పేర్ని నాని మధ్య రెండున్నర గంటలపైగా చర్చ జరిగింది. అయితే వర్మ భేటీపై ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇందంతా కేవలం ఐదుగురి ప్లాన్ అన్నారు.
RGV–Perni Nani Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టికెట్ల వ్యవహారానికి పుల్ స్టాప్ పడుతుందా..? రేపు ఈ వ్యవహారంపై చర్చించనున్న కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. టాలీవుడ్ (Tollywood) కి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక ఏపీ ప్రభుత్వం (AP Government) వాధిస్తున్నట్టు టికెట్ల రేట్లు తగ్గించడానికే మొగ్గు చూపుతుందా.. ఈ విషయాలపై రేపు రేపు క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈ లోపే మంత్రి పేర్ని నాని(Minster Perni Nani)తో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సమావేశం అవ్వడం సంచలనంగా మారింది. కమిటీ సమావేశానికి ముందే వీరిద్దరి మధ్య చర్చ జరగడంపై కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం తాను సినిమా పరిశ్రమ తరపున మంత్రితో చర్చంచ లేదని.. ఒక ఫిల్మ్ మేకర్ గా మాత్రమే తన అభిప్రాయాలు చెప్పాను అన్నారు. కచ్చితంగా టికెట్ల వ్యవహారంపై సానుకూల నిర్ణయమే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల మూసివేత వ్యవహారం తనకు సంబంధం లేదన్నారు. అలాగే కేవలం పవన్ కళ్యాణ (Pawan Kalyan), బాలయ్య (Balayya)ల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆర్ఆర్ఆర్ (RRR), రాధే శ్యామ్ (Radhe Shayam) సినిమాల వాయిదాకు ఏపీలో పరిస్థితులే కారణమన్నారు..
వర్మతో చర్చలపైన మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు.. వర్మ తన అభిప్రాయాలు తాను చెప్పారని.. ఆయన అభిప్రాయాలను ఒక మంత్రిగా బాధ్యతతో కమిటీ ముందు ఉంచుతాను అన్నారు. నిజంగా ఎవరికైనా టికెట్ల వ్యవహారం నష్టం కలిగిస్తోంది అంటే.. వారు వచ్చి కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు.. అలాగే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల వాయిదాకు కేవలం దేశంలో కరోనా పరిస్థితులే కారణమన్నారు. ఏది ఏమైనా రేపు టికెట్ల రేట్లు తగ్గించాలా.. పెంచాలా అని ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా.. ప్రభుత్వం వేసిన కమిటీ సూచనల మేరకే ఉంటుంది అన్నారు. రేపు మరోసారి సమావేశం కానున్న కమిటీ.. దీనిపై క్లారిటీ ఇస్తుంది అన్నారు.
అయితే వీరిద్దరి కలయికపై సినిమా పెద్దలు ఎవరూ స్పందించకపోయినా.. ప్రొడ్యూసర్ నట్టికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇతరులకు ‘అమ్ముడుపోయిన ఆర్జీవీ.. ఇండస్ట్రీ తరఫున చర్చలకు వెళ్లలేదన్నారు. అసలు ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పుకునే ఆర్జీవీ చర్చలకు వెళ్లడమేంటి అని ఆయన ప్రశ్నించారు. ఆయన చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో ఇలా టైంపాస్ కోసం మాత్రమే వెళ్తున్నారని ఆరోపించారు..
ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దాని నివేదిక వచ్చేదాకా ఎవరూ ఏమీ చేయలేరని అభిప్రాయపడ్డారు. తాజాగా వర్మ ఎపిసోడ్ చూస్తే ఇదంతా ఓ ఐదుగురు కలిసి ఆడుతున్న గేమ్ అన్నారు. కేవలం టికెట్ రేట్లు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించి జనాన్ని దోచుకునే ప్లాన్ లో భాగమే అన్నారు. ఈ చర్చలతో ప్రజలకు, చిన్న సినిమాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని రద్దు చేయడం పేర్ని నాని చేతుల్లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటారని.. వర్మను, వర్మ సినిమాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.