హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం... విచారణకు ఆదేశించిన మంత్రి

విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం... విచారణకు ఆదేశించిన మంత్రి

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

అత్యవసర పరిస్థితుల్లోనో, మెరుగైన వైద్యం కోసమో, ఇతర సౌకర్యాల కోసమో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ వారి బలహీనతలను ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

  అత్యవసర పరిస్థితుల్లోనో, మెరుగైన వైద్యం కోసమో, ఇతర సౌకర్యాల కోసమో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ వారి బలహీనతలను ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కాసుల కక్కుర్తి, డాక్టర్ల నిర్లక్ష్యం లోకం చూడకుండానే పసిప్రాణాన్ని తీసింది.

  విజయవాడ డోర్నకల్ రోడ్డులోని ఫ్యామిలీ ఆస్పత్రిలో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో కడుపులోనే బిడ్డ చనిపోయింది. ఆస్పత్రి నిర్వాకంపై మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటుపల్లికి చెందిన మహిళ పెళ్లైన ఏడేళ్ల తర్వాత గర్భం దాల్చింది. విజయవాడ డోర్నకల్ రోడ్డులోని ఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. నొప్పులు రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.., అంతా బాగానే ఉందని కాన్పు చేస్తామని చెప్పిన డాక్టర్లు.. ఆమెను అడ్మిట్ చేసుకున్నారు.

  కొద్దిసేపటి తర్వాత కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సరైన సమయానికి తీసుకురాకపోవడంతోనే ఇలా జరిగిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని మండిపడుతున్నారు. పేషెంట్ రికార్డుల్లోనూ తప్పులు రాశారని వాపోయారు. విషయం కాస్తా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చేరడంతో విచారణ జరపాల్సిందిగా కృష్ణాజిల్లా DM&HO సుహాసినిని ఆదేశించారు.

  ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పూర్తి బాధ్యత యాజమాన్యాలదేనని ఆయన స్పష్టం చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Alla Nani, Vijayawada

  ఉత్తమ కథలు