హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏలూరులో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ‘కరోనా ఖైదీలు..’

ఏలూరులో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ‘కరోనా ఖైదీలు..’

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీరు పశ్చిమగోదావరి జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులు.

  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలు కరోనా కేర్ సెంటర్ నుంచి పారిపోయారు. ఏలూరులో ఈ ఘటన జరిగింది. ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న 77మంది రిమాండ్ ఖైదీలకు ముందుజాగ్రత్తగా జిల్లా జైలు సూపరింటెండెంట్ M.వేణుగోపాల రెడ్డి కరోనా పరీక్షలు చేయించారు. వారిలో 25మంది ఖైదీలకు కోవిడ్ నిర్దారణ అయింది. వారితోపాటు ఇద్దరు జిల్లా జైలు సిబ్బందికి కరోనా నిర్దారణ అవడంతో 10మంది ఖైదీలను కోవిడ్ -19 లెవెల్ 1 ఆశ్రం ఆశుపత్రికి లో చికిత్స నిమిత్తం తరలించారు. లక్షణాలు లేని 15మందిని వట్లూరు CCR కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్కు చికిత్స నిమిత్తం తరలించి ఒక్కొక్క రూములో ముగ్గురు ఖైదీల చొప్పున ఉంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈరోజు తెల్లవారుఝామున CCR కోవిడ్ కేర్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు సెక్యూరిటీ కళ్ళుకప్పి పరారయ్యారు.

  వీరు పశ్చిమగోదావరి జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరారైన ఖైదీలు జంగారెడ్డిగూడెంకు చెందిన పోలవరపు నాగ దుర్గాప్రసాద్ (20) ఇతను పశ్చిమగోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో పలు దొంగతనాలు చేశాడు. పరారైన రెండో రిమాండ్ ఖైదీ భీమవరం మండలం గునిపూడి గ్రామానికి చెందిన పండూరు వెంకట్ నారాయణ. జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడు.

  సమాచారం అందుకున్న ఏలూరు 3టౌన్ పోలీసులు వట్లూరు CRR కోవిడ్ కేర్ సెంటర్ కు చేరుకొని పరారైన ఖైదీలకు కరోనా సోకిన కారణాంగా స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి నిందితులకోసం గాలింపు ముమ్మరం చేశారు. విషయం తెలుసుకొన్న జిల్లా SP కె. నారాయణ్ నాయక్ వట్లూరులో ఉన్న సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు‌.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Eluru

  ఉత్తమ కథలు