Andhra Pradesh: నర్సింగ్ విద్యార్థినితో ప్రిన్సిపాల్ బాడీ మసాజ్.. అందుకు కండిషన్ ఏంటో తెలుసా..?

కోరిక తీరిస్తే పాస్ చేస్తాను అంటూ ప్రిన్సిపాల్ కండిషన్

పరీక్ష పాస్ అవ్వాలి అంటే ఆ పని చేయాలని ఓ ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. ఒకటి రెండు సార్లు కాదు ఒకే రోజు ఆమెతో మూడు సార్లు ఆయిల్ మసాజ్ చేయించుకున్నాడు. అక్కడితో ఆగని ఆయన తన కోరికలు తీరిస్తేనే పాస్ చేస్తానంటూ వేధింపులకు దిగాడు. దీంతో ఆ విద్యార్థిని ఏం చేసింది అంటే..?

  • Share this:
    ప్రాక్టికల్ పరీక్షకు వచ్చిన ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఆ కాలేజ్ ప్రిన్పిపాల్ మనసు పడ్డాడు.. వెంటనే ఏం ఆలోచించకుండా ఆమె ముందు ఓ కండిషన్ పెట్టాడు.. తన బాడీకి ఆయిల్ మసాజ్ చేయాలని కోరాడు.. అలా మూడు సార్లు మసాజ్ కూడా చేయించుకున్నాడు. అక్కడితోనే ఆగక వెకిలి వేషాలు ప్రదర్శించాడు.. అయినా అతడి కామ దాహం తీరలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యార్థులకు బుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఇలా దారి తప్పడంపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సొంత బిడ్డలా విద్యార్థినిని చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ కామాంధుడిగా మారాడు. దీంతో తన కోరిక తీరిస్తేనే ప్రాక్టికల్స్ లో పాస్ చేస్తానని లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. తనకు నచ్చిన విధంగా బాడీ మసాజ్ చేయించుకున్న ఆ ప్రిన్సిపాల్.. అక్కడితోనే ఆగలేదు తరచూ తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాజువాకలో ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

    మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా నిత్యం మహిళలు, బాలికల మీద ఇలాంటి లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైంగిక దాడులకు చెక్ పెట్టడం కోసం దిశా చట్టం తీసుకొచ్చినా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని మూరుమూల గిరిజన తండా కు చెందిన విద్యార్థిని కాకినాడలో నర్సింగ్ చదువుతోంది. ప్రస్తుతం థర్డ్ ఇయర్ నర్సింగ్ కోర్స్ చేస్తున్న గిరిజన విద్యార్థినిపై ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేసిన ఘటన బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

    ఇటీవల ఆమెను ప్రాక్టికల్ పరీక్షల కోసం గాజువాక షీలా నగర్ లోని మదర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. దీంతో ఆ పరీక్షల కోసం వచ్చిన విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపల్ ఎం వెంకట్రావు లైంగిక వేధింపులకు గురి చేశారు. తాను చెప్పినట్టు నడుచుకోక పోతే పరీక్ష పాస్ అవ్వకుండా ఫెయిల్ చేస్తానని బెదిరించడంతో పాటు ఆమెను శారీరకంగా ఇబ్బంది పెట్టారు. ఒకేరోజు మూడుసార్లు ఒళ్లంతా మసాజ్ చేయించుకున్న సదరు ప్రిన్సిపాల్, విద్యార్థినిని తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోదరుడితో కలిసి గాజువాక పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విద్యార్థిని సదరు ప్రిన్సిపల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

    తనను లైంగిక వేధింపులకు గురి చేసిన తీరును పోలీసులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో పోలీసులు ప్రిన్సిపల్ వెంకట రావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. విషయం తెలియడంతో మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకుడే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం అత్యంత హేయమైన చర్యని మండిపడుతున్నాయి. విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: