M Narendra Modi on RTC Bus Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డి గూడెం వద్ద ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు (RTC Bus) వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime minster Naredra Modi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమంటూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి సహా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొకరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్సగ్రేషియాను అందిస్తాం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు’’ అని ప్రధాని కార్యాలయం ట్విట్లో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన వారికి, ఒక్కొకరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్సగ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు.
— PMO India (@PMOIndia) December 15, 2021
ప్రధాని మోదీతోపాటు.. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. బస్సు ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్విట్ చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్విట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) December 15, 2021
సీఎం జగన్ (AP CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రులు, అధికారులను ఆరాతీసిన జగన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సహయాక చర్యలు వేగవంతం చేయాలన్న జగన్.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన... సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బస్సు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వారు వెల్లడించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Bus accident, Pm modi