హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక ముందే మృత్యుఘోష.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియో ప్రకటన ఎంతంటే?

Road Accident: పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక ముందే మృత్యుఘోష.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియో ప్రకటన ఎంతంటే?

అనంతపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

అనంతపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. గొప్ప సంబంధమే దొరికిందని తండ్రి మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపింది ఆ కుటుంబ.. పెళ్లి తంతు ముగిసిన కాసేపటిలో ఆ ఇంట మృత్యుఘోష విషాదం నింపింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇంకా చదవండి ...

PM Modi on Road Accident:  ఆ తండ్రికి ఒక్కనాగొక్క కూతురు..అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. గొప్ప సంబంధం దొరికిందని మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపాడు. ఏకైక కుమార్తెకు ఘనంగా వివాహం (Marriage) జరిపించాడు. పెళ్లికి వచ్చిన అతిథులు నూతన జంటను ఆశీర్వదించారు. కూతురిని అత్తారింటికి పంపుతూ.. పెళ్ళిలో జరిగిన ఘటనలను తలచుకుంటూ.. మురిసిపోతూ.. సంతోషంగా సాగిపోతున్న వారి ప్రయాణం ఊహించని మలుపు తీసుకుంది.  వీరి వాహనం బూదగవి వద్ద వస్తుండగా.. అనంతపురం (Anantapuram) నుంచి బళ్లారి (Ballari) వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్‌ఓర్‌ లారీ (Iron lorry) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇన్నోవా (Innova car) ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్‌ సీటులోని వెంకటప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి  (Governent Hospital)తరలించగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలొదిలాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్రగాయాలతో వాహనంలోనే మృతి చెందారు.  ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. దీంతో నింబగల్లు తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

వాహనంలో ఉన్న 9 మంది మృతి చెందారు. మృతుల్లో 5మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  ఉరవకొండ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని బొమ్మనహాళ్‌కు చెందిన అశోక్, రాధమ్మ, సరస్వతి, శివమ్మ (పిల్లలపల్లి), శుభద్రమ్మ (రాయలదొడ్డి), లత్తవరానికి చెందిన స్వాతి(38), జాహ్నవి (12), జశ్వంత్ (12), నింబగల్లుకు చెందిన వెంకటప్ప(60)గా గుర్తించారు. రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 9మంది మృతదేహాలకు అర్ధరాత్రి పోస్ట్‌‌మార్టం నిర్వహించి తెల్లవారు జామున 4 గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే రోజు 9 మందిని కోల్పోవడం చాలా బాధాకరమని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మృతుడు వెంకటప్ప చాలా మంచి వాడని అందరితో కలసి మెలసి ఉండేవారని ఇలాంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాదాకరం అన్ని స్నేహితులు రోదిస్తూ తెలిపారు. 

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.. పెళ్లి జరిగిన కొన్ని గంటలకే ఇలా జరగడం తీవ్రంగా కలిచివే సిందన్నారు..  మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా PMNRF నుండి చెల్లిస్తామంటూ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.


వీరి మరణ వార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. మరోవైపు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తంచేశారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవ‌డం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నిమ్మగళ్లు గ్రామ పెళ్లి ఇంట్లో జ‌రిగిన విషాదంలో పెళ్లి కుమార్తె తండ్రి స‌హా చిన్న పిల్లలు చ‌నిపోయిన ఘ‌ట‌న కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, ప‌య్యావుల కేశ‌వ్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు ప్రభుత్వం న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news, Pm modi, Road accident

ఉత్తమ కథలు