ISRO Chandrayaan-2 : అన్నీ అనుకున్నట్లే జరిగితే... ఇప్పుడు యావత్ ఇండియా... సంబరాల్లో మునిగిపోయేది. జయహో ఇస్రో అంటూ ప్రశంసల జల్లు కురిపించేది. చంద్రయాన్-2 ప్రాజెక్టులో... విక్రమ్ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాకపోవడమనే సాంకేతిక సమస్య... దేశ ప్రజలకు నిరాశ కలిగించింది. ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అత్యంత బాధ కలిగిస్తోంది. నిజానికి పదేళ్ల కష్టం అది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన శాస్త్రవేత్తలు... ఈ ప్రయోగాన్ని విజయవంతం చెయ్యడానికి ఎప్పుడూ లేనంతగా శ్రమించారు. ఐతే... చివరిక్షణాల్లో ఏమైందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి రెండ్రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇవాళ ఉదయం 8 గంటలకు ఇస్రో కంట్రోల్ సెంటర్ నుంచీ ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
#ISRO
Honorable Prime Minister Shri. Narendra Modi will address the nation from ISRO Control Centre today (September 07, 2019) at 0800 hrs IST.@PMOIndia @narendramodi
— ISRO (@isro) September 6, 2019
అసలేం జరిగింది : విక్రమ్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకమైనవి..అత్యంత క్లిష్టమైనవి..! ఇస్రో ముందు నుంచీ చెప్పిన మాట ఇది..! అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌కు అవాంతరయాలు ఎదరయ్యాయి. ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి. మరి విక్రమ్ క్రాష్ అయిందా? లేదంటే ల్యాండ్ అయ్యి కేవలం సిగ్నల్స్ మాత్రమే అందడం లేదా? అని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
This is Mission Control Centre. #VikramLander descent was as planned and normal performance was observed up to an altitude of 2.1 km. Subsequently, communication from Lander to the ground stations was lost. Data is being analyzed.#ISRO
— ISRO (@isro) September 6, 2019
చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.
Rough breaking of #VikramLander ends and Fine braking phase starts#Chandrayaan2 #ISRO
— ISRO (@isro) September 6, 2019
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి...గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఐతే స్పీడ్ కంట్రోల్ కాక విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిందా? లేదంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాక సిగ్నల్స్ నిలిచిపోయాయా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు డేటా విశ్లేషణ చేస్తున్నారు. ల్యాండర్ పరిస్థితిపై రెండ్రోజుల్లో ప్రకటన చేసే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrayaan-2, ISRO, Narendra modi