ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...

Lok Sabha Election 2019 : మరో 25 రోజులైతే... ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. ఈ లోపే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా...

Krishna Kumar N | news18-telugu
Updated: April 25, 2019, 6:17 AM IST
ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...
చంద్రబాబు నాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనమంతా ఒకలా అనుకుంటుంటే, కేంద్రం మరోలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 25 రోజుల్లో ఫలితాలు వస్తాయనీ, అప్పటివరకూ టీడీపీ అధికారంలో ఉండి... ఆ తర్వాత ఫలితాలను బట్టీ... ఎవరు అధికారంలో ఉండేదీ తెలుస్తుందని మనం అనుకుంటుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 25 రోజులూ రాష్ట్రపతి పాలన తెచ్చే యోచనలో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఉన్నతాధికారుల విషయంలో ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయంటున్నారు న్యాయ నిపుణులు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైతం... టీటీడీ నగల విషయంలో లేవనెత్తుతున్న ప్రశ్నలు... అధికార పక్షానికి సవాలుగా మారబోతున్నాయనీ, ఈ పరిణామాలు కేంద్రం జోక్యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 25 రోజులు ఉంటే... ఇప్పటికే ఈవీఎంల వీవీప్యాట్లలో 50 శాతం స్లిప్పులను కౌంటింగ్ చెయ్యాలంటూ, అందుకు మద్దతు కోసం దేశమంతా తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో చాలా సమస్యలున్నాయి. ఎండలు పెరిగాయి. తాగునీటి సమస్య ఎక్కువవుతోంది. అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. శ్రీలంకలో పేలుళ్ల ప్రభావంతో ఏపీలో కూడా శాంతిభద్రతలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇదే సమయంలో ఉన్నతాధికారులు తమదైన సొంత ప్రకటనలు చేస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం తమపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఉన్నతాధికారులు ఆరోపిస్తుంటే... ఉద్యోగులు తమకు సహకరించట్లేదని ప్రభుత్వం మండిపడుతోంది.


టీటీడీ బంగారం వివాదం కూడా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తోంది. బంగారం తరలింపు వెనక టీడీపీ కుట్ర ఉందంటున్న వైసీపీ... వారం రోజుల్లో ఆధారాలతో సహా నిరూపిస్తామని ప్రకటించింది. బంగారం విషయంలో టీటీడీ, ప్రభుత్వం రెండూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదనీ, తెరవెనక కుట్ర ఉన్నందువల్లే ఇలా చేశాయనీ వైసీపీ ఆరోపిస్తోంది. కావాలనే లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తూ... లబ్ది పొందేందుకు వైసీపీ యత్నిస్తోందని టీడీపీ కౌంటర్లిస్తోంది. ఇలా రెండు పార్టీలూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

ఇవన్నీ గమనిస్తున్న కేంద్రం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని భావిస్తున్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తుండటంతో... కేంద్రం అలర్ట్ అవుతోంది. ముఖ్యంగా ఫలితాల ప్రకటన రోజున రాష్ట్రంలో కచ్చితంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నిఘా వర్గాలు చెప్పడంతో ముందుగానే రాష్ట్రపతి పాలన తెచ్చే ఆప్షన్‌ను కేంద్రం పరిశీలిస్తోందని తెలిసింది. ఫలితాలకు ముందే రాష్ట్రపతి పాలన తెస్తే, టీడీపీ పూర్తిస్థాయి (ఐదేళ్లు) అధికారంలో ఉన్నట్లు అవ్వదు. అది ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. ఐతే... రాష్ట్రపతి పాలన తెచ్చేంత దారుణ పరిస్థితులు ఏవీ లేవంటున్న టీడీపీ వర్గాలు... అంతా వైసీపీ చేస్తున్న హైడ్రామా అని కొట్టిపారేస్తున్నాయి. ఫలితాల రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేకుండా చేస్తామంటున్నాయి.

 

ఇవి కూడా చదవండి :పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...

చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...
First published: April 25, 2019, 6:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading