భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 24న ఏపీకి రానున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఆయన తిరుమల రాబోతున్నారు. నవంబరు 24న శ్రీవారిని దర్శించుకొని అదే రోజు రాష్ట్రపతి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తిరుమలకు రానున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి సీఎం జగన్, టీటీడీ అధికారులు స్వాగతం పలకనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ramnath kovind, Tirumala Temple, Tirupati, Ttd