Home /News /andhra-pradesh /

Andhra Pradesh: త్వరలో ఏపీకి రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.., టూర్ షెడ్యూల్ ఇదే..

Andhra Pradesh: త్వరలో ఏపీకి రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.., టూర్ షెడ్యూల్ ఇదే..

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఫైల్)

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఫైల్)

భారత రాష్ట్రపతి (President of India) రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) త్వరలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యటించునున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ (Adityanath Das) సమీక్ష నిర్వహించారు.

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈనెల 7న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, సాడమ్ ప‌ర్యటనలకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం అమరావతి సచివాలయం వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యనటకు సంబంధించి ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేనివిధంగా వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ 7వతేది మధ్యాహ్నం చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ యోగశాల, భారత్ యోగ విద్యాకేంద్రాన్నిప్రారంభించనున్నారని సిఎస్ తెలిపారు.

    అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంఖుస్థాపన చేయనున్నట్లు ఆదిత్యానాథ్ దాస్ తెలిపారు. అనంతరం సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లు పాల్గొనేందుకు సంబంధించి కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదిత్యానాధ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసినట్లు జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాష్‌ వివరించారు.

    రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేపట్టనున్నబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యంగా ఎఐఆర్, దూరదర్శన్‌లతో పాటు నాలుగు వీడియో టీంలను కవరేజి నిమిత్తం ఏర్పాటు చేస్తున్నామని ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లా కలక్టర్, ఎస్పీలు సహా సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖల పరంగా చ‌ర్య‌లు చేపట్టనున్న ఏర్పాట్లను సిఎస్‌కు వివరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP Governor, AP News, Chittoor, Gautam Sawang, President of India, Ramnath kovind, Telugu news, Tirupati, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు