విజయనగరంలో మరో డోలీ ఘటన.. గర్భిణిని మోసుకుంటూ 8 కి.మీ..

విజయనగరంలో మరో డోలీ ఘటన.. గర్భిణిని మోసుకుంటూ 8 కి.మీ..

గర్భిణిని డోలిలో మోసుకెళ్తున్న దృశ్యం

డోలీ కట్టి అందులో ఆమెను మోసుకుంటూ 14కి.మీ దూరంలో ఉన్న దబ్బగుంటకు బయలుదేరారు. దాదాపు 8కి.మీ వెళ్లాక పురిటి నొప్పులు ఎక్కువై మార్గమధ్యలోనే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

  • Share this:
    విజయనగరం జిల్లాలో డోలీ ఘటనలకు తెరపడటం లేదు. ఏళ్లు గడుస్తున్నా జిల్లాలోని చాలావరకు గ్రామాలకు ఇప్పటివరకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో రోగమొచ్చినా,నొప్పి వచ్చినా.. డోలీలే వారికి దిక్కు. తాజాగా శృంగవరపు కోట మండలం దారపర్తి పంచాయతీ శివారు పొర్లు గ్రామంలో మరో డోలీ ఘటన చోటు చేసుకుంది.

    పొర్లు గ్రామానికి చెందిన గర్భిణి కేరంగి చిన్నాలమ్మకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో డోలీ కట్టి అందులో ఆమెను మోసుకుంటూ 14కి.మీ దూరంలో ఉన్న దబ్బగుంటకు బయలుదేరారు. దాదాపు 8కి.మీ వెళ్లాక పురిటి నొప్పులు ఎక్కువై మార్గమధ్యలోనే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అదే డోలీలో తల్లీబిడ్డలను మోసుకుంటూ దబ్బగుంటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనంలో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూరింటెండెంట్ డా.త్రినాథరావు తెలిపారు. డెలివరీ దగ్గరపడటంతో 10 రోజుల ముందు గానే వచ్చి ఆసుపత్రిలో ఉండమని చెప్పామని డాక్టర్లు తెలిపారు. ముందుగానే ఆసుపత్రిలో చేరి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదన్నారు.

    Published by:Srinivas Mittapalli
    First published: