Home /News /andhra-pradesh /

PRC FIGHT NO SALARIES FOR THIS MONTH AP EMPLOYEES UNION LEADERS SLAMS GOVERNMENT NGS

No Salaries: ఈ నెల జీతాలు రాకుండా కుట్ర.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్

ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..?

ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..?

No Salries: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..? కావాలనే ప్రభుత్వం జీతాలు వేయకూడదని ప్రయత్నిస్తోందా..? అసలే కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.. మరి ఇప్పుడు జీతాలు కూడా పడకపోతే పరిస్థి ఏంటి..? ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్టు ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తే.. ఆ నెల సెలరీలు కూడా అంతేనా..?

ఇంకా చదవండి ...
  No Salaries: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల వివాదం తీవ్ర స్థాయి చేరింది. ప్రభుత్వం చర్చలు అంటుంటే.. ఉద్యోగ సంఘాలు (Employees union) మాట్లాడుకోవడాలు లేవంటున్నాయి.. పీఆర్సీ  (PRC) రద్దు చేయడం.. పాత పీఆర్సీ ప్రకారం జీతాలు (Salaries) వేయడం చేసిన తరువాతే.. చర్చలైనా ఏమైనా అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇటు ట్రెజరీ ఉద్యోగులు, అటు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు కూడా వేతనాల ప్రాసెస్ చేయానికి నో చెప్పినా.. ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేయాలని పట్టు పడుతోంది. దీంతో 26వ తేదీ దాటిన ఇప్పటి వరకు జీతాల ప్రాసెస్ ప్రారంభం కాలేదు.. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇక జీతాలు పడే అవకాశం లేదు.. తరువాత అయినా పడతాయా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు.. ఉద్యోగ సంఘాలు పట్టు వీడడం లేదు. ఇక సమ్మె ప్రారంభమైతే.. పూర్తిగా జీతాలు నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జీతాలు రాకపోతే తమ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు సాధారణంగా టైంకు జీతం పడుతుంది.. లోన్లు కూడా త్వరగా వస్తాయి కాబట్టి.. చాలామందికి తొలి వారంలోనే ఈఎంఐ డేట్లు ఉంటాయి.. కానీ ఇప్పుడు టైంకు జీతాలు పడకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగులకు జీతాలు పడకపోతే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు..

  నిజంగా ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలపై శ్రద్ధ ఉంటే.. పాత జీతాలనే ప్రాసెస్ చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మతం లేకుండా కొత్త పీఆర్సీ ఎలా అమోదిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల జీతాలు అకౌంట్లో పడకపోతే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని.. ఉద్యోగులకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.. అసలు ఉద్యోగులంతా పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది. పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

  ఇదీ చదవండి : రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు.. అదంతా ఆయన పనే.. అశోక్ బాబు సంచలన ఆరోపణలు

  పైగా అసద్యతాలు ప్రసారం చేయడం చాలా దారుణమన్నారు. బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది. తమకు ఇచ్చే డబ్బులు కూడా పిల్లల తిండికే సరిపోతున్నాయి. తమ పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం మాకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. .. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇప్పటికే చాలా ఒపిక పట్టామని.. ఇంకా ఆగితే తమకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉందన్నారు బండి శ్రీనివాసరావు.

  ఇదీ చదవండి : రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు.. అదంతా ఆయన పనే.. అశోక్ బాబు సంచలన ఆరోపణలుసీఎం జగన్ కు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందా..? నిర్మాత సంచలన వ్యాఖ్యలు

  ఇన్నేళ్ల తన సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు..? ఉద్యోగుల అలవెన్సులు తగ్గించి జీతాల్లో కోత పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుకోవాలన్నారు. ఇంతవరకు ఒక్కసారే మేం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూశామని.. తమ కడుపు మంటను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలన్నారు. జరుగుతోన్న యుద్దంలో ఉద్యోగులంతా ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించే బుద్ది ప్రభుత్వానికి ప్రసాదించాలని అంబేద్కర్ ని కోరాంమన్నారు ఉద్యోగ సంఘ నేతలు..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Cm jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు