Home /News /andhra-pradesh /

PRC FIGHT AP GOVERNMENT WARN TO TREASURY EMPLOYEE FOR POSSESSING THIS MONTH SALARIES NGS

AP PRC Fight: పెన్షన్లు, జీతాల బిల్లుల ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిందే..? ట్రెజరీ ఉద్యోగులకు వార్నింగ్.. వాట్ నెక్స్ట్..

ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..?

ఉద్యోగులకు ఈ నెల జీతాలు లేనట్టేనా..?

AP PRC Fight: ఈ నెల ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ వీడడం లేదు.. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు.. కానీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామని ప్రభుత్వం అంటోంది. అక్కడితోనే ఆగని ఏపీ ప్రభుత్వం.. జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని.. లేదంటే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులను హెచ్చరించింది.

ఇంకా చదవండి ...
    AP PRC Fight:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  పీఆర్సీ ఇష్యూ రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. పీఆర్సీ (PRC) రద్దు చేసిన తరువాత చర్చలు అంటున్నాయి ఉద్యోగ సంఘాలు (Employees Union).. కుదరదు కొత్త పీఆర్సీ అమలు చేసి తీరుతామంటోంది ప్రభుత్వం. కనీసం జనవరి నెలల జీతాలు పాత పద్దతిలో ఇచ్చి.. తరువాత చర్చలకు పిలవండి అని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ఈ నెల ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు ససేమిరా అన్నారు. మూడు సార్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కుదరదని తేల్చి చెప్పేశారు. ఇలా అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఉద్యోగులు గానీ.. వెనక్కి తగ్గడం లేదు. జనవరి శాలరీని.. రివైజ్డ్ పే స్కేల్‌ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. అయితే.. ట్రెజరీ ఉద్యోగులు (Treasury Employees ) కూడా ఉద్యమంలో భాగం కావడంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాలేదు. లెటెస్ట్ గా…జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. ఒకవేళ కాదని మొండి పట్టుదలతో ప్రాసెస్ ప్రారంభించకుంటే.. క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

    డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇవాళ రాత్రి లోపు బిల్లులను అప్ లోడ్ చేయాలని డీడీఓలకు సూచనలు జారీ చేసింది. శుక్రవారంలోగా… అప్ లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.

    ఇదీ చదవండి : జగన్ నిర్ణయానికి జై.. తండ్రి పేరు ప్రస్తావించని బాలయ్య.. ఆయన డిమాండ్ ఇదే..

    ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్ వోడీలకు, కలెక్టర్లకు ఆదేశాల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది. మరోవైపు.. తాజాగా ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో పీఆర్సీ సాధన కమిటీ ప్రత్యేకంగా సమావేశమై.. తాజా పరిస్థితులపై చర్చించింది. ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఆలోచన చేస్తోంది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. చర్చలు అంటే ఉద్యోగులకు ఇష్టం లేదనే భావన క్రియేట్ చేయడం సరైంది కాదన్నారు. గతంలో నివేదికతో పాటు గంటన్నర పాటు తమ ఉద్యమ నేతలు మంత్రులతో మాట్లాడరని.. ఆ సందర్భంగా చేసిన డిమాండ్లకే తాము కట్టుబడి ఉన్నామన్నారు..

    ఇదీ చదవండి : ఉద్యోగులను సమ్మెకు వెళ్లనీయం.. నాలుగు మెట్లుదిగేందుకు సిద్ధం

    తాము చర్చలకు వెళ్లాలి అంటే.. ముందు జనవరి నెల జీతాలు పాత పద్దతి ప్రకారమే చెల్లించాలని.. అలాగే చేస్తే తాము చర్చలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోకపోవడం దారుణమన్నారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా నిర్ణయించడం.. గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. 27 శాతం ఐఆర్‌ ఉంటే.. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ నిర్ణయించారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులకు ఫిబ్రవరిలో జనవరి జీతాలు అందుతాయా? లేదా? అన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు