Home /News /andhra-pradesh /

PRASHANT KISHORE DECISION ON JOINING CONGRESS PARTY WILL JOIN THE DREAMS OF TELANGANA CM KCR AND AP CM YS JAGAN MOHAN REDDY AK

KCR Jagan PK: కేసీఆర్, జగన్‌కు కొత్త తలనొప్పి.. ఇద్దరికీ సమస్యగా మారిన ప్రశాంత్ కిశోర్.. లెక్క మారిపోతోందా ?

జగన్, పీకే, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

జగన్, పీకే, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Prashant Kishore: తనకు గత ఎన్నికల్లో విజయం దక్కేలా వ్యూహరచన చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయాన్ని మరోసారి తీసుకునేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. అదే సమయంలో తెలంగాణలో బలపడుతున్న బీజేపీని టార్గెట్ చేసేందుకు ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకోవాలని కేసీఆర్ అనుకున్నారు.

ఇంకా చదవండి ...
    రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుడే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవడంతో.. ఇరు రాష్ట్రాల అధికార, విపక్షాలు ఎన్నికల్లో గెలవడం ఎలా అనే అంశంపై ఫోకస్ పెట్టాయి. తనకు గత ఎన్నికల్లో విజయం దక్కేలా వ్యూహరచన చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయాన్ని మరోసారి తీసుకునేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. అదే సమయంలో తెలంగాణలో బలపడుతున్న బీజేపీని టార్గెట్ చేసేందుకు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) సాయం తీసుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే ఎన్నికల వ్యూహకర్త పాత్ర నుంచి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే దిశగా క్రియాశీల రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ కిశోర్.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి.

    అన్నీ అనుకున్నట్టు జరిగితే.. అతి త్వరలోనే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీని కొత్త పంథాలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌కు కొత్త సమస్యలు తీసుకురానున్నాయనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడంతో.. కేసీఆర్‌కు(CM KCR) రాష్ట్రస్థాయిలో ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పీకే వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.

    అలా తన కోసం పని చేస్తాడని అనుకున్న ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ కోసం పని చేయడం కేసీఆర్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అదే సమయంలో పీకే సూచనలతో రంగంలో ఉండబోయే కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కేసీఆర్‌కు సవాల్‌గా మారనుంది. ఇక పీకే కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఏపీ సీఎం జగన్‌కు(YS Jagan) కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్‌, వైఎస్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీలో పొత్తు కుదరకపోయినా.. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో జగన్ కలిసి పని చేసేలా పీకే ఒప్పించే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి బీజేపీ నాయకత్వం జగన్‌కు ఇబ్బందులు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన ఉంది.

    AP Politics: కాంగ్రెస్ తో దోస్తీ జగన్ కు కలిసొస్తుందా..? ఈ ప్లాన్ చంద్రబాబుకు లాభమా..? నష్టమా..?

    FCI Checks rice missing: తెలంగాణలోని రైస్​ మిల్లుల్లో బియ్యం మాయంపై ఎఫ్​సీఐ తనిఖీలు.. టీఆర్ఎస్​ సర్కారుపై పైచేయి దిశగా బీజేపీ?

    అంతేకాదు జగన్, పీకే మధ్య సంబంధాల నేపథ్యంలో చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని.. మళ్లీ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వైసీపీని ఢీ కొట్టవచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ముందుగానే ఊహించి.. సీఎం జగన్ ప్రశాంత్ కిశోర్‌ను దూరంగా పెట్టే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ గూటికి చేరనున్న ప్రశాంత్ కిశోర్.. ఇటు కేసీఆర్, అటు జగన్‌కు ఇబ్బందులు సృష్టించే ఛాన్స్ కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, CM KCR, Prashant kishor

    తదుపరి వార్తలు