ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బ్లాక్ డే అంటున్న కేఏ పాల్

ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, బ్రాహ్మణుడు కాబట్టే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.

news18-telugu
Updated: January 26, 2019, 5:02 PM IST
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. బ్లాక్ డే అంటున్న కేఏ పాల్
కేఏ పాల్, ప్రణబ్ ముఖర్జీ
  • Share this:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే ఇది విచారకరమైన రోజు అన్నారు. ఓ రకంగా ఇది బ్లాక్ డే గా అభివర్ణించారు కేఏపాల్. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మీద కేఏ పాల్ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ప్రణబ్ ముఖర్జీకి అసలు భారతరత్న అందుకునే అర్హత లేదన్నారు. గతంలో ఆయనపై తమ సంస్థ కేసు వేసిందని చెప్పారు . ప్రణబ్ ముఖర్జీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని, తమ గ్లోబల్ పీస్ సంస్థ ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసు వేసినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి వచ్చి ప్రణబ్ ముఖర్జీకి సమన్లు కూడా ఇచ్చారన్నారు.

కేఏ పాల్, ప్రణబ్ ముఖర్జీ
కేఏ పాల్, ప్రణబ్ ముఖర్జీ


ప్రణబ్ ముఖర్జీనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద కూడా కేఏ పాల్ విమర్శలు చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఎందుకు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడు, బ్రాహ్మణుడు కాబట్టే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారని కేఏ పాల్ ఆరోపించారు. లోక్‌సభలో మెజారిటీ ఉంది కదా అని ఎవరికి పడితే వారికి అవార్డు ఇస్తారా అని ప్రశ్నించారు.

ka paul complaint
కేఏ పాల్(File)


2004లో ప్రణబ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ ఆరోపించారు.

indian economy, india economy rank, india uk economy, india, pm narendra modi, economy, భారత ఆర్థిక వ్యవస్థ, భారత ఎకానమీ, భారత్, బ్రిటన్, ప్రధాని నరేంద్ర మోడీ
నరేంద్ర మోదీ(File)


మాజీ లోక్‌సభ స్పీకర్, ప్రపంచ శాంతి కోసం పాటుపడిన బాలయోగికి అవార్డులు ఎందుకు ఇవ్వలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. బాలయోగి దళితుడు కాబట్టే ఆయనకు అవార్డులు ఇవ్వలేదా అని నిలదీశారు. కనీసం టీడీపీ కూడా బాలయోగి తరఫున మాట్లాడలేదన్నారు.ఇవి కూడా చదవండి

First published: January 26, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading