‘యూనిఫాం తీసేస్తే మేమూ మాట్లాడగలం’.. విజయసాయిరెడ్డిపై ఎస్పీ కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు

ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీకి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: March 29, 2019, 7:22 PM IST
‘యూనిఫాం తీసేస్తే మేమూ మాట్లాడగలం’.. విజయసాయిరెడ్డిపై ఎస్పీ కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
విజయసాయిరెడ్డి, కోయ ప్రవీణ్
  • Share this:
(డి.లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్, ప్రకాశం జిల్లా, న్యూస్ 18)

యూనిఫాం తీసేస్తే తాము కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాగలమని.. కానీ, అలా మాట్లాడమని ఎస్పీ కోయ ప్రవీణ్ కుమార్ అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి ఫిర్యాదు చేయడంపై ప్రకాశం జిల్లా ఎస్పీ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా చూడటం తమ బాధ్యత అని చెప్పారు. వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే.. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీకి తనపై వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినట్లు మీడియాలో చూశానని.. వారు ఏమని ఫిర్యాదు చేశారో చూసి.. న్యాయ సలహా తీసుకుంటానని.. చట్టప్రకారం ముందుకు వెళతానని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి ఎక్కువగా ఉంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు మీద గతంలో పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు డీజీపీ ఠాకూర్, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ మీద ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>