హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Prakasham District: ఒక్క ఆన్ లైన్ గేమ్.. రూ.2లక్షలు మాయం.. యువకుడి కథ విషాదాంతం

Prakasham District: ఒక్క ఆన్ లైన్ గేమ్.. రూ.2లక్షలు మాయం.. యువకుడి కథ విషాదాంతం

కృష్ణ (FIle)

కృష్ణ (FIle)

కరోనా (Corona) పుణ్యమా అని పిల్లలు మొబైల్ ఫోన్ (Mobile Phones) కు బానిసలయ్యారు. మొబైల్ గేమ్‌ (Mobile Games) ల పట్ల మక్కువ పిల్లల జీవితాన్ని దెబ్బతీస్తోంది.

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

కరోనా (Corona) పుణ్యమా అని పిల్లలు మొబైల్ ఫోన్ (Mobile Phones) కు బానిసలయ్యారు. మొబైల్ గేమ్‌ (Mobile Games) ల పట్ల మక్కువ పిల్లల జీవితాన్ని దెబ్బతీస్తోంది. అయితే గతేడాదిలో స్కూలు మూతపడడంతో ఇంట్లో ఉండి ఆన్ లైన్ క్లాసులు (Online Classes) వినడానికి తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోన్ (Smart Phone) కొనిచ్చారు. అప్పటివరకు ఫోన్ ముట్టుకుంటేనే వద్దని వారించిన తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ వాడకానికి అనుమతించారు. కానీ ఆ కుర్రాడు ఆన్లైన్ క్లాసులు పేరుతో నాలుగైదు గంటలు, తర్వాత చదువుకునే పేరుతో మరికొన్ని గంటలు ఫోన్ చేతిలో ఉండడంతో ఆ ఫోన్ కు బానిస అయిపోయాడు. రాత్రిపూట నిద్రపోకుండా గంటలు గంటలు ఫోన్లో గేమ్స్ ఆడుతూ బానిసయ్యాడు.

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలైన పిల్లల జీవితాలు ఎలా తారుమారయ్యాయో కొందరు విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది. ఇలా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడిన ఒక యువకుడు డబ్బు చెల్లించలేక ప్రాణాలు తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా (Prakasham District) లో జరిగింది.

ఇది చదవండి: అతడిపై 150 కేసులు.. నేరాలపై యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు.. చివరకు ఇలా చిక్కాడు


ప్రకాశంజిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరం గ్రామానికి చెందిన లింగాల చెన్న కృష్ణ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. చెన్న కృష్ణ పూర్తిగా గేమ్స్ కు బానిసయ్యాడు. అలా అదే క్రమంలో ఆన్ లైన్ గేమ్ సంస్థకు రెండు లక్షలు బకాయి పడ్డాడు. ఆ అప్పు చెల్లించాలని సదరు సంస్థ నుండి తీవ్ర వత్తిడి వచ్చింది. ఐతే ఆ వత్తిడిని తట్టుకోలేక చెన్న కృష్ణ తల్లి తండ్రులకు తెలుపగా ఒక లక్షా అరవై వేల రూపాయలు చెల్లించారు. మిగతా బకాయి కోసం ఆన్లైన్ గేమ్ సంస్థ మరింత ఒత్తిడి తెచ్చింది.

ఇది చదవండి: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..


బకాయి చెల్లించలేక, ఒత్తిడిని తట్టుకోలేక చెన్న కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులుకన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులను సైతం కంట తడిపెట్టించింది. ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో పిల్లలు, యువత ఆన్ లైన్ గేమ్స్ కు పూర్తిగా బానిసలయ్యారు. ఈ క్రమంలో డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే మొబైల్ కు అతుక్కుపోయి ఆరోగ్యాలు పాడుచేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకే పిల్లలకు అతిగా మొబైల్ ఫోన్ ఇవ్వొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Mobile game, Prakasham dist

ఉత్తమ కథలు