Shaik Salam, News18, Ongole
Who is Next CM: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే గెలుపుపై ఫోకస్ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు సిద్ధం చేస్తున్నాయి. గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి కూడా..? మరోవైపు వచ్చే ఎన్నికల తరువాత సీఎం కాబోయేది ఎవరు అంటూ ప్రత్యేక చర్చ జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు మరో ఛాన్స్ ఇస్తారా..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chndrababu Naidu) కు లాస్ట్ ఛాన్స్ దక్కుతుందా..? మార్పు కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు పట్టం కడతారా..? ఇలా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రశ్నలకు ఓ చిలక సమాధానం చెప్పింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో చిలక జ్యోస్యానికి బాగానే ఆదరణ ఉండేది. మారిన కాలానికి అనుగుణంగా సాంకేతికత అభివృద్ధి జరగడంతో చిలక జ్యోష్యాలకు ప్రస్తుతం ఆ స్థాయిలో ఆదరణ లేదనే చెప్పవచ్చు.
కానీ చిలక జ్యోష్యం ఎంత వరకు నిజం అనే మాటకు సమాధానం లేక పోయినా, అక్కడక్కడ చిలక జ్యోతిష్కుల మాటలు మన చెవిలో పడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ చిలక జ్యోతిష్కుడిని న్యూస్18 పలకరించింది. కాగా ఆ చిలక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్లుగానే న్యూస్ 18 ప్రచురించిందనే విషయాన్ని పాఠకులు గమనించగలరు.
ప్రధాన పార్టీలైన వైసీపీప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే దృక్పథంతో సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగిపోతున్నారు. అదే రీతిలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ చతురతతో ముందుకు పోతున్నారు. అంతేకాదు ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమదే కీ ఆఫ్ రోల్ అంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సైతం తన రాజకీయ సమీకరణాలలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి : బదిలీల జీవో వచ్చిందో లేదో..! వీళ్ల హడావిడి మామూలుగా లేదు..
మరి రానున్న ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో ఓ చిలక జ్యోతిష్కుడు, నెక్స్ట్ సీఎం ఎవరో ముందుగానే కరాఖండిగా జోష్యం చెప్పేశాడు. అసలు రానున్న ఎన్నికలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేందుకు చిలక జ్యోతిష్కుడిని న్యూస్ 18 సంప్రదించగా, సదరు జ్యోతిష్కుడు మొదటగా సీఎం జగన్ పేరున కార్డు తీయాలంటూ చిలకను ఆదేశించాడు. ఇంకేముంది పంజరంలో నుండి చిలుక బుడిబుడి అడుగులు వేస్తూ, బయటకు వచ్చి ఓ కార్డు తీసింది.
ఇదీ చదవండి : ఏటీఎంలో చోరీకి విఫలయత్నం.. చివరికి ఏం జరిగిందంటే..?
ఆ కార్డులో పరమేశ్వరుడు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిల చిత్రాలు కనిపించాయి. ఇంకేముంది వెంటనే సదరు జ్యోతిష్కుడు తన జ్యోతిష్యాన్ని చెప్పేశాడు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ మరోమారు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని తెలిపాడు. అంతేకాదు రానున్న కాలంలో సీఎం జగన్ కు అంతా మంచే జరుగుతుందని ప్రకటించాడు. ఇంతకు ఈ చిలక జోస్యం చెప్పింది ఎవరో కాదు 18 సంవత్సరాలుగా చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న చిలక జ్యోతిష్కుడు శివ నాగరాజు.అయితే ఏది ఏమైనా మారిన సాంకేతికత కాలానికి అనుగుణంగా రానున్న ఎన్నికలలో ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందో తెలియాలంటే ఎన్నికల షెడ్యూల్ నుండి ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Local News, Prakasam