రిపోర్టర్: షేక్ సలాం
లొకేషన్: ప్రకాశం
ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి కొన్ని రిజర్వేషన్లుంటాయి. కొన్ని కలాల ప్రాతిపదికన ఉంటే.. మరికొన్న దివ్యాంగుల కోటాలో భర్తీ చేస్తారు. ఐతే ఈ రిజర్వేషన్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ దివ్యాంగులు రోడ్డెక్కారు. తమ రిజర్వేషన్ కోటాలో కేటాయించబడ్డ పోస్టును తమకే అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఒంగోలు లో దివ్యాంగులైన అంధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సదరు దివ్యాంగుల వివరాల మేరకు... ఒంగోలులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో 2019 సంవత్సరం జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును ఓసి రిజర్వేషన్ లో భాగంగా దివ్యాంగులైన మహిళకు కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే దివ్యాంగులకు కేటాయించాల్సిన పోస్టును, అదే డిఎంహెచ్ఓకార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు పదోన్నతి కల్పిస్తూ అధికారులు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టును భర్తీ చేశారు. దీనితో ఇటీవల సదరు విషయాన్ని గుర్తించిన అంధుల సంఘం నాయకులు తమకు న్యాయం చేయాలని, సమాచార చట్టం ద్వారా పూర్తి వివరాలను సేకరించడం జరిగిందన్నారు.
ఒంగోలులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో జూనియర్ స్టెనోగ్రాఫర్ నియామకంపై జరిగిన అవకతవకల పట్ల పూర్తి విచారణ నిర్వహించి న్యాయం చేయాలని విజువల్లి ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నరాజు అన్నారు. తమకు కేటాయించిన పోస్టులు తమకే అందేలా, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దివ్యాంగులకు మంజూరైన పోస్టును మరొకరికి పదోన్నతి పై అందించడం ఎంతవరకు సమంజసమన్నారు. మరి అధికారులు వీరి ఆవేదన ఎంత వరకు అలకిస్తారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Ongole, Prakasam